నారద వర్తమాన సమాచారం
చిల్లాపురం ప్రాథమిక పాఠశాలలో విద్యా అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం
మిర్యాలగూడ ,డిసెంబర్ 31:
చిల్లాపురం గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యా ప్రమాణాల అభివృద్ధి లక్ష్యంగా విద్యా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యా కమిటీ చైర్మన్ మౌనిక శ్రవణ్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌తో పాటు తోటి ఉపాధ్యాయులు నాయకత్వం వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మచ్చ మధు, ఉప సర్పంచ్ రాంబాబును ఘనంగా ఆహ్వానించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరంపై వారు ఉపాధ్యాయులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాగరాజు, సైదులు తదితరులు పాల్గొని విద్యా రంగ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో విద్యకు ప్రాధాన్యం పెంచేందుకు అందరూ కలిసి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.పాఠశాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసికట్టుగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








