నారద వర్తమాన సమాచారం
మాచర్ల విద్యుత్ శాఖ (EE)ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
ఎన్.సింగయ్యను సత్కరించిన హెచ్.ఆర్.పి డబ్ల్యూ ఏ అధ్యక్షులు గురజాల అప్పారావు
పల్నాడు జిల్లా నరసరావుపేటలో
లోని 26 జనవరి 2026న జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యుత్ శాఖలో ఉత్తమ సేవలు అందించినందుకుగాను ఉత్తమ అధికారిగా పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృత్తికా శుక్ల చేతులు మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూతలపాటి సింగయ్యను మంగళవారం
ఆంధ్ర ప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాచర్ల వారి కార్యాలయం నందు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు ఆధ్వర్యంలో శాలవాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా
దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు
పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కుక్కమూడి ప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింగయ్య ఉత్తమ అధికారిగా అవార్డు తీసుకోవటం సంతోషంగా ఉందని ఆయన ఆఫీసుకు వచ్చే వినియోగదారుల సమస్యలను క్షుణ్ణంగా విని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వినియోగదారుల మన్ననలు పొందిన అధికారి సింగయ్య అని భవిష్యత్తులో మరెన్నో అవార్డులు తీసుకోవాలని
ఇంకా ఉన్నత అధికారిగా ప్రమోషన్లు పొందాలని భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు.
అభినందనలు తెలియజేసిన వారిలో
ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టు & వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు, జమ్మలమడక తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ పరిమళ్ళ రాజారావు తదితరులు ఉన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







