శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం మఠాధిపతులు శ్రీ వెంకటాద్రి స్వామి ఆకస్మికంగా తనిఖీ….
నారద వర్తమాన సమాచారం
శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి అనుబంధంగా ఉన్న శ్రీ కనుమ పోలేరమ్మ దేవస్థానం వద్ద బుధవారం రాత్రి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం మఠాధిపతులు శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వామి వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.గతంలో ఇదే దేవస్థానం నందు ఏడాదిలోనే రెండుసార్లు హుండీ చోరీ చేసిన చర్యలు లేకుండా పోయాయి.గతాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రస్తుత నూతన మఠాధిపతి రాత్రివేళ ఈ ఆకస్మిక తనిఖీ చేయడం పై కందిమల్లాయపల్లె పుర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అలాగే గతంలో రెండు సార్లు హుండీ చోరీ చేసిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రస్తుత పీఠాధిపతి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








