Tuesday, February 17, 2026

మిర్యాలగూడలో ఘనంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు

కార్యసాధకుడు ‘కేసీఆర్’

మిర్యాలగూడలో ఘనంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు

ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసిన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే లు భాస్కర్ రావు, తిప్పన విజయసింహ రెడ్డి

నారద వర్తమాన సమాచారం/ నల్గొండ జిల్లా ఇంచార్జ్ / శంకర్

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కార్యసాధకుడు అని మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అభివర్ణించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నిర్వర్తించిన కృషి చరిత్రాత్మకమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ప్రకటించని హామీలను కూడా ఒక్కోటి నెరవేరవేర్చిన మాహానేత కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో రెడ్డి కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన భారీ కేకును కట్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులంతా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని కేసీఆర్ పుట్టినరోజును వేడుకలా నిర్వహించుకున్నారు. అనంతరం శెట్టిపాలెం, వేములపల్లి గ్రామాల్లో నిర్వహించిన రక్తదానం శిబిరాల్లో భాస్కర్ రావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాలకు అపూర్వ స్పందన లభించింది. సుమారు 50 మంది యువకులు మరియు పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రశంశ పత్రాలను అందజేసి, వారిని అభినందించారు. అనంతరం శెట్టిపాలెం గ్రామం నందు మొక్కలు నాటారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. తెలంగాణ మాదిరి దేశం కూడా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version