Saturday, March 21, 2026
spot_img

బ్రాహ్మణులు ఎవరు? సమాజంలో బ్రాహ్మణులు అని పిలవబడుతున్న వాళ్లందరూ బ్రాహ్మణులేనా?

నారద వర్తమాన సమాచారం

బ్రాహ్మణులు ఎవరు? సమాజంలో బ్రాహ్మణులు అని పిలవబడుతున్న వాళ్లందరూ బ్రాహ్మణులేనా?

సనాతన ధర్మానికి మూల గ్రంథములు వేదములే.
వేదములు మానవ కులంలో ఒక వర్గానికి మాత్రమే బ్రాహ్మణులు అని గుర్తించి స్తుతిస్తుంది.
ఈ వర్గము జాత్యాతీతులు , పరమాత్మ ఆజ్ఞానుసారము తను సృష్టించిన సృష్టిని కాపాడేందుకు అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా సృష్టించబడ్డ సృష్టి నిర్మాణ విజ్ఞానులు. వీరే విశ్వకర్మ వంశబ్రాహ్మణులు. జ్ఞానము విజ్ఞానము ఉన్నవారే బ్రాహ్మణులని వేదములు మరియు కొన్ని ఆధ్యాత్మిక గ్రంథములు తెలియజేయుచున్నది.
“శిల్ప మధ్యయనం నామవృత్తం బ్రాహ్మణ లక్షణం”…. మహాభారతం.
పురాణ ఇతిహాసాలే కాకుండా అన్ని వేదాల నుంచి కూడా ఆధారాలు చూపిస్తూ సంపూర్ణ వ్యాసాన్ని ప్రజలకు అందజేస్తాను.
పూర్తి వివరణలతో ఆధార సహితంగా ఆర్టికల్ వ్రాసి ప్రజలందరికీ ఈ రహస్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాను.
దాస్ పాల్యా గారు ఆయన ఫేస్బుక్లో ఈ స్టేట్మెంట్ పెట్టారు ” సత్యాలు కఠోరంగా ఉంటాయి. బ్రాహ్మణ అని చెప్పుకుంటున్న వాళ్ళు బ్రాహ్మణులు కాదు. స్మార్తులు కూడా కాదు. శైవులూ కాదు, వైష్ణవులూ కాదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్లుగా”…..

ఇందులో సత్యము ఉంది.
ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్న వారందరూ బ్రాహ్మణులు కారు.
దీనికి ఆధారం ఏంటంటే వారు వ్రాసుకున్నటువంటి మనుస్మృతి గ్రంథములో ఉన్నటువంటి ఒక శ్లోకం పరిశీలిస్తే అసలు బ్రాహ్మణులు అంటే ఎవరు అనే విషయం ప్రజలందరికీ అర్థమవుతుంది.
ఆశలోకం చూడండి…..
జన్మనాజాయతే శూద్రః , కర్మణా జాయతే ద్విజః |
వేద పాఠంతు విప్రాణాం , బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణః||
ఈ శ్లోకం యొక్క భావం:-
సనాతన ధర్మములో పుట్టిన వాళ్ళందరూ పుట్టుకతోనే శూద్రులంట, ఈ శూద్రులు అందరికీ ఉపనయనం చేసుకునే హక్కు ఉందని ఆ ఉపనయనం చేసుకునే వాళ్ళు మాత్రమే ద్విజుల అవుతారనిన్నీ ఆ ద్విజులలో ఎవరైతే వేదాలను అధ్యయనం చేసే అభ్యాసం చేసుకుంటారో వారందరూ విప్రులవుతారు అంట ఈవిప్రులలో ఎవరికైతే బ్రహ్మ జ్ఞానం ఉంటుందో వారే బ్రాహ్మణులు అని ఈ శ్లోకం యొక్క సారాంశం.
విశేష వివరణ :
పుట్టినా ప్రతి ఒక్కడు శూద్రుడు అని చెప్పుకున్నారు తరువాత ఈశూద్రులు అందరికీ కూడా అంటే జాతి భేదం లేకుండా ఉపనయనము చేసుకునే అధికారము కలదు అనగా యజ్ఞోపవీతము అథవా జందెము వేసుకునే అధికారము అందరికీ కలదని మొదటి వాక్యము యొక్క అంతరార్థం. కానీ అందరూ వేసుకుంటున్నారా ఎందుకు వేసుకోవట్లేదు దానికి కారణం ఎవరు?
తర్వాత రెండవ వాక్యానికి వస్తే ఇలా ఎవరైతే యజ్ఞోపవీత ధారణ చేస్తారో అనగా జంధ్యాన్ని ధరిస్తారో వారు ద్విజులవుతారు అనగా అన్ని జాతులు వాళ్లు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి అన్ని వర్గ ప్రజలు ఈ యజ్ఞోపవీతాన్ని ధరించవచ్చు ఇందులో జాతి భేదము లేదు అని ఈ లెక్కన ప్రతి ఒక్కడు యజ్ఞోపవీతాన్ని ధరించి ద్విజులవ్వొచ్చు అని దీని అంతరార్థం.
ఇక మూడవ వాక్యానికి వివరణ లోకి వెళ్తే ఈ ద్విజులందరిలో ఎవరైతే వేదాన్ని అభ్యసిస్తారో అధ్యయనం చేస్తారు వారందరూ విప్రులు అని పిలబడతారు, అర్థాత్ అన్ని జాతుల వారు అనగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి అన్ని వర్గాల ప్రజలు ద్విజులయింతరవాత వేదాలు అభ్యసించి విప్రులు అవ్వచ్చు అన్నమాట. విప్రులు అయ్యేందుకు ఫలానా కులం వాళ్లే అర్హతలున్న వారు అనే భావము ఇక్కడ కనిపించట్లేదు.
అతి ముఖ్యమైన నాలుగవ వాక్యం వివరంలోకి వెళ్తే బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణః — అనగా వేదాధ్యయనము చేసి విప్రులైన వాళ్లలో ఎవరికైతే బ్రహ్మ జ్ఞానం ఉంటుందో వారే బ్రాహ్మణులు అని పిలవబడతారంట.
అసలైన చిక్కుముడి ఇక్కడే ఉంది. అసలు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? మన ప్రజలు మాటవరసకు అంటారు ఇదేమైనా బ్రహ్మ జ్ఞానమా, బ్రహ్మవిద్యా….. అని ఒక సామెతగా వాడుతూ ఉంటారు.
కానీ వేదాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాడే అందులో రహస్యాన్ని తెలుసుకుని ప్రజలకు వేద జ్ఞానం కలిగింపజేస్తున్న వాడికి తెలుస్తుంది బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి అని. వేదమంత్రాలను అర్థం చేసుకునేందుకు నిరుక్తము అనే ఒక గ్రంథము ఉంటుంది ఇది వేద విద్యలలో షడన్గాలలో ఒకటి.
ఈ గ్రంథము మరియు వైదిక నిఘంటువులలో బ్రహ్మ అనే పదానికి మూడు రకమైన అర్థములు సూచిస్తున్నవి.
అవి బ్రహ్మ అనగా జేష్ఠము – శ్రేష్టము – మంత్రము అని మూడు అర్థములు మనం గ్రహించవచ్చు.
ఇప్పుడు మనకు తెలిసిన జ్ఞానము ద్వారా దీన్ని డి కోడ్ చేద్దాం.
మీకు తెలిసిన పౌరాణిక దేవతలు అందరులలో
జేష్టుడు ఎవరు అని మీరు ప్రశ్నించుకుంటే మీకు చాలా కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది.

మనకి లభించే అష్టాదశ పురాణాల్లో ఏమున్నది?
ఎందుకంటే పౌరాణిక జ్ఞానము మనుష్యునికి అయోమయంలో పడేసి ఈ ప్రశ్నకు సమాధానం దొరక్కుండా చేస్తుంది. పురాణాల్లో ప్రధాన దేవతలైన బ్రహ్మ ,విష్ణు,శివుడు ,ఆదిపరాశక్తి ల గురించి ఆయా పురాణంలో ఏ విధంగా వ్రాయబడిందో ఒకసారి పరిశీలిద్దాం.
1 . ఉదాహరణకు విష్ణు పురాణము తీసుకుంటే అందులో సృష్టి విషయం మీరు పరిశీలిస్తే మొదట విశ్వమంతా జలమయమై ఉంటుందని అందులో ఒక వటపత్రం పై మహావిష్ణువు బాలకుడి రూపంలో సయనిస్తూ తన పాదములో బొటన వేలిని చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకున్నట్టుగా కనిపిస్తూ తన నాభి నుంచి ఒక కమలం పుట్టి ఆ కమలంలో బ్రహ్మ ఆవిర్భావము చెంది తన కన్నా ముందు పుట్టిన విష్ణువు యొక్క ఆజ్ఞనుసారము ప్రపంచాన్ని సృష్టిస్తాడు అని విష్ణు పురాణం చెబుతుంది.

  1. .ఇక రెండవది శివపురాణం తీసుకుంటే మొట్టమొదట భూమి కనిపిస్తుంది భూమిపైన బ్రహ్మ విష్ణువులిద్దరూ ప్రత్యక్షమవుతారు తర్వాత వారిలో ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ నేను సృష్టికర్తని నేను పోషణ కర్తని అని చెప్పుకుంటారు ఇలా చెప్పుకునే సందర్భంలో నేను గొప్ప వాడిని నేను గొప్పవాడిని వాదులాడుకుని తగాదాపడతారు. అప్పుడు వారికి కొద్దిగా దూరంలో ఒక అగ్నిస్తంభం పుడుతుంది. అది చూసిన బ్రహ్మ విష్ణువులు ఒక నిర్ణయానికి వచ్చి ఎవరైతే ముందుగా అగ్ని స్థంబాన్ని మూలాగ్రాలు తెలుసుకుంటారో వారే గొప్పవారని నిర్ణయించుకుని విష్ణువు వరాహరూపాన్ని ధరించి భూమి లోపల ఆగ్నిస్తంభం మూలం ఎంత దూరంలో ఉంది అని వెతికెందుకు బయలుదేరుతాడు బ్రహ్మదేవుడు తన హంస వాహనాన్ని అధిరోహించి ఆగ్ని స్థంభం యొక్క శిఖరం ఎంత దూరంలో ఉంది అనే విషయాన్ని తెలుసుకునేందుకు పైకెగురుతూ ఉంటాడు.
    ఇలా కొన్ని వేల సంవత్సరాలు వాళ్లు ప్రయాణిస్తూ ఉంటారు గమ్యం దొరకలేదు ఒకరోజు బ్రహ్మకు పైనుంచి మొగలిపువ్వు కిందకు పడడం గ్రహించి దాన్ని పట్టుకొని ఎక్కడ నుంచి పడుతున్నావు అని అడుగగా నేను పరమేశ్వరుడి శిరస్సు పైనుండి పడుతున్నాను అని సమాధానం చెబుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషంతో అయితే నేను గమ్యానికి సమీపంగా వచ్చానన్నమాట అని పలుకగా ఆ మొగలిపువ్వు విరక్తిగా నవ్వుతూ అయ్యో బ్రహ్మదేవా నేను గత కొన్ని వేల సంవత్సరముల నుంచి శివుడు తలపై నుంచి కిందికి పడుతూనే ఉన్నాను ఇంతవరకు గమ్యం దొరకలేదు. అని బదిలిస్తుంది
    అప్పుడు ఆశ్చర్యపడ్డ బ్రహ్మదేవుడు ఇకపైకి వెళ్లడం వృధా ప్రయాస అనే భావిస్తూ మొగులు పువ్వుకి అబద్ధపు సాక్ష్యము చెప్పమని చెబుతూ దాన్ని పట్టుకు వస్తూ మార్గమధ్యంలో కనిపించిన కామధేనువుకు కూడా సాక్ష్యం చెప్పమని ఒప్పిస్తాడు. బ్రహ్మదేవుడు తిరుగు ప్రయాణం విషయం గ్రహించిన విష్ణువు తన ఓటమిని అంగీకరిస్తూ మొదట వారు పందెం నిర్ణయించిన స్థలానికి చేరుకుంటారు ఇరువురు. బ్రహ్మదేవుడు తన అబద్ధపు సాక్షాలతో విజయగర్వాన్ని ప్రదర్శించగా అప్పుడు అగ్నిస్తంభం నుంచి ఈశ్వరుడు ప్రత్యక్షమై మూర్ఖులారా మీకు నేను సృష్టించి మీ ఇరువురికీ పరీక్ష పెట్టాను నువ్వు పుట్టుకతోనే అబద్ధాలాడి మోసపు చేష్టలకు పాల్పడినందుకు నీకు భూలోకంలో పూజలు ఉండకుండు గాక అని శపించాడు అదేవిధంగా దొంగ సాక్ష్యం చెప్పినందుకు మొగలు పువ్వుకు పూజ అర్హత లేకుండా శపిస్తూ కామధేనువు తలతో అవునని చెప్పినా తోకను అడ్డంగా ఓపి కాదని చెప్పినందుకు ఆ పుచ్చ భాగం పూజార్హత ఉంది అని ముఖము చూడ పాపమని శపిస్తాడు. ఈ పురాణంలో శివుడు జ్యేష్ఠుడుగా కనిపిస్తాడు.

3 . ఇప్పుడు దేవి పురాణాన్ని పరిశీలిస్తే అందులో ఎలా ఉందో చూద్దాం. మొట్టమొదట దేవి కనిపిస్తుంది భూమి పై నుంచొని ఒక మంత్రదండం పట్టుకొని మూడుసార్లు కొట్టగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవిస్తారు.
అప్పుడు వారితో ఆదిపరాశక్తి ఒక్కొక్కరిని అడుగుతుంది తనని వాహనం చేసుకుంటే సృష్టి కార్యక్రమం మొదలు పెడదాము అని. ఆ ప్రశ్నకు బ్రహ్మ మరియు విష్ణు లో మాతృ సమానురాలను మన సృష్టించిన దానవు మిమ్మల్ని అట్లా వివాహం చేసుకుంటామనేసరికి తన యొక్క మూడో నేత్రంతో భస్మం చేస్తుంది. ఇది గ్రహించిన శివుడు జాగ్రత్త పడి నేను వివాహం చేసుకుంటాను గాని నాకు మూడు విధాలు ఇమ్మని కోరుతాడు. సరే అనే ఒప్పుకుని వరములేమిటి అని అడగగా. మొదటి వరంగా బ్రహ్మ విష్ణు బతికించమని రెండవ రంగా దేవి యొక్క మూడవ నేత్రాన్ని తనకు ఇవ్వవలసిందిగా మరియు మూడోవ రంగా ఆదిపరాశక్తి అయినటువంటి తన మహాశక్తిలో శివునికి అర్ధ భాగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాడు.
అప్పుడు దేవి ఒప్పుకొని ఈ మూడు వరాలు ఇస్తుంది.
అప్పుడు దేవి ఇచ్చిన వరాలతో బ్రహ్మ విష్ణువు బతికించుకుంటాడు తర్వాత మూడో నేత్రాన్ని ధరిస్తాడు ఆదిపరాశక్తి యొక్క శక్తి లో సగం శక్తిని గ్రహించి అప్పుడు ఆమెను వివాహం ఆడి సృష్టికార్యము ప్రారంభిస్తారు అని ఈ పురాణం ద్వారా తెలుస్తుంది
ఈ దేవి పురాణంలో ఆదిపరాశక్తి అత్యున్నత దేవతగా కనిపిస్తుంది. శ్రేష్టురాలుగా కనిపిస్తుంది ఇలా ప్రతి పురాణంలో ఒక్కొక్క దేవత అత్యున్నత దేవతగా అనగా కథానాయకుడిగా కథానాయకిగా ఉంటారు.
ఈ అష్టాదశ పురాణాలు వ్రాసినది ఎవరు? ఆ వ్యాసుడు ఎందుకు ఇలా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా వ్రాస్తూ సనాతన భారతీయుల్ని అయోమయానికి గురి చేశారు? ఇప్పుడు ఈ పురాణాల ద్వారా ఏ దేవతని మీరు శ్రేష్టులుగా చెప్పగలరు? దేవాదిదేవుడుగా పరమాత్మగా ఎవరిని నిర్ణయించగలరు? పురాణములలో ప్రధాన దేవతలు అందరికీ కూడా శాపాలున్నాయి.
ఈ శాప గ్రస్తులైన దేవతలు శ్రేష్ఠులు అయ్యే అవకాశం ఉంటుందా ఆలోచించి చెప్పండి?
కనుకనే పురాణాలు వాదోపోవాదనలకు కోర్టులో కూడా స్వీకరించట్లేదు. సనాతన ధర్మానికి మూల గ్రంధాలు కేవలం వేదములు మాత్రమే.
వేదముల ప్రకారము పరమాత్మ ఎవరు?
జేష్ఠుడు – శ్రేష్ఠుడు – మంత్రము అనే పదములకు నిజమైన అర్థము కేవలం వేదములలోనే లభిస్తుంది.
మనకు వేదములలో సృష్టి సూక్తులను కొన్ని సూక్తులు లభిస్తాయి. అందులో ముఖ్యమైనవి నాసదీయ సూక్తము , బ్రాహ్మణస్పతి సూక్తం , పురుష సూక్తము , విశ్వకర్మ సూక్తం , బృహస్పతి సూక్తములు ఇవే కాకుండా కృష్ణ యజుర్వేదంలో ఏడవ కాండము 1 వ ప్రపాటకము 5వ ప్రశ్న లో ఉన్న
“ఆపోవా ఇదమగ్రే సలిలమాసీత్తస్మిన్ ప్రజాపతిర్వాయుర్భూత్వా ೭చరత్స ఇమా మపశ్యత్తాం వరహో భూత్వా೭హరత్తాం విశ్వకర్మ భూత్వా వ్యమార్ట్సా೭ప్రథత సా పృథివ్యభవ తత్ పృథివ్యై పృథివిత్వం|| . 1 తస్యామశ్రమ్య త్ప్రజాపతిః సి దేవానసృజత వసున్రుద్రానాదిత్యాన్తే దేవాః ప్రజాపతి మబ్రువన్ప్రజాయామహా ఇతి సో೭బ్రవీత్|| 2. … (కృష్ణ యజుర్వేదం 7:1:5)
అనే సూక్తము ఈ ఆరు సూక్తాలకు అనుసంధానం చేస్తూ సృష్టి రహస్యాన్ని వివరిస్తూ
మొదట పరమాత్మ విశ్వకర్మ నిరాకార రూపంలో అతిపెద్ద మండుతున్న అగ్నిగోళంగా కోటి సూర్య ప్రభలతో వెలుగుతూ ఉండి తను బహుళం అవ్వాలనే సంకల్పంతో

  1. ప్రథమంగా జలాన్ని సృష్టిస్తున్నట్లుగా తరువాత తానే వాయు రూపాన్ని ధరించి జలంలో ప్రవేశించి నాలుగు దిక్కుల వెతుకగా అనగా ఆ జలమునందు సంచరించెను. ఆ సలిల ముందు భూమిని చూసి దాన్ని సృష్టికి అనుకూలంగా ఉంటుందని భావించి వరాహ రూపాన్ని ధరించి తన కోరపల్లులతో ఆ భూమిని నీటి ఉపరితలంపైకి తీసుకువచ్చి మరల మునిగిపోకుండా అక్కడ ప్రతిష్టాపన చేస్తారు. ఆ పరమాత్మ విశ్వకర్మ ఆ భూమిని విస్తరించినందుకు పృథ్వి అని నామము భూమికి కలుగుతుంది.
    2.తర్వాత ఆయన సాకార రూపం దాల్చి ప్రజాపతిగా విశ్వకర్మ పంచముఖ దశ బాహువుల రూపంతో వ్యక్తమై ఆ భూమిని తన చేతులతో నివాస యోగ్యము చేయుటకై శుద్ధిచేసి అనగా జలాన్ని తుడిచి కొంతకాలము భూమిపై విశ్రాంతి తీసుకుంటాడు.
    తర్వాత పంచభూతాలలో తర్వాతే భూతము ఆజ్ఞని ప్రతిష్టాపన చేసి అనగా సృష్టించి సృష్టిని ప్రారంభించి 33 కోట్ల దేవతలను ఆ యజ్ఞం ద్వారా సృష్టించారు. 33 కోటి దేవతలు అనగా ఇక్కడ కోటి అంటే వైదిక పరిభాషలో ఒక వర్గము అని అర్థం ఆ విధంగా అష్ట వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్య లను సృష్టించిన తర్వాత వీరిపై ఒక రాజుగా ఇంద్రుని సృష్టించి తనపై అధికారిగా ప్రజాపతి తో కలిపి 33 వర్గ దేవతలను సృష్టించి తరువాత పరమాత్మ విశ్వకర్మ మొత్తం విశ్వాన్ని సృష్టించినట్లుగా అనగా వివిధ సౌర మండలాలు పాలపుంతలు అన్ని కలిపి గెలాక్సీ అనగా విశ్వమును సృష్టించినట్లుగా మనకు వైదిక సాహిత్యం మరియు ఆధునిక విజ్ఞానము బిగ్ బ్యాన్ థియరీ ద్వారా తెలియజేస్తుంది.
    ఇప్పుడు చెప్పిన ఈ సృష్టి విధానం అంతా పైన చెప్పిన ఆరు సృష్టి సూక్తములలో ఇదే విషయాన్ని వివరిస్తూ వేదములు తెలియజేస్తున్నాయి. ఈ అన్ని విధానాల్లో సృష్టికర్తగా పరమాత్మగా ప్రజాపతిగా ధాత విధాత అని సవిత అని దేవాది దేవుడని సకల దేవతలను జీవరాసులను భువన భాండములను సృష్టించిన సృష్టికర్త అని పరమాత్మ విశ్వకర్మను స్తుతిస్తున్నాయి వేదాలు.
    సృష్టికి మొదటి నుంచి ఆది అంతము లేనటువంటి నిత్య శాశ్వతుడైన విశ్వకర్మ పరమాత్మయే జ్యేష్ఠుడనీ ఆయన సృష్టి ద్వారానే మిగతా దేవతలందరూ మరియు తన యొక్క అన్ని వర్గముల ప్రజలు జీవులు ఉద్భవించాలని వేదములు తెలియజేయుచున్నవి. కనుక జ్యేస్టుడు విశ్వకర్మ పరమాత్మయే అని స్పష్టంగా తెలియజేయుచున్నది.
    ఇక శ్రేష్టుడు అనే పదాన్ని విశ్లేషణ చేసేందుకు పరిశీలింప గా ఎటువంటి శాపములు మచ్చలు లేని శ్రేష్టుడిగా పరమాత్మ ప్రజాపతి విశ్వకర్మ అని తెలుస్తుంది.
    ఇక మూడవది మంత్రము . మంత్రమునకు అధిపతి అనగా అన్ని వేదమంత్రములు పరమాత్మ యొక్క ముఖోద్భవాలు అనే వేదములే తెలియజేయుచున్నవి.
    అనగా మానవ మేధావులు వారికి కావలసిన అంశములు కొరకు తపస్సు చేయగా వేదమంత్రముల రూపములో ఆ విజ్ఞానాన్ని ఉపదేశించిన పరమాత్మ విశ్వకర్మ. అనగా విశ్వకర్మ పరమాత్మయే అన్ని మంత్రములకు అధిపతి అని తెలుసుకున్నది.
    ఇప్పుడు ఎన్ని విషయాలు కూలంకర్షంగా పరిశీలిస్తే బ్రహ్మ అనే పదానికి అర్థం జ్యేష్టుడు శ్రేష్టుడు మంత్రాధిపతి పరమాత్మ విశ్వకర్మ అని గ్రహించగలరు.
    ఈ పరమాత్మ గురించి తెలుసుకునే జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము. ఆ పరమాత్మ విశ్వకర్మ యొక్క మహిమలు ఆయన యొక్క విభూతులు వేదముల ద్వారా అధ్యయనం చేసుకుని ప్రజలకు పరమాత్మ భక్తీ తత్వాన్ని ప్రచారం చేసిన వాడే నిజమైన బ్రహ్మజ్ఞాని ఆయనే బ్రాహ్మణుడు అని దీని అర్థం.
    ఇక విషయానికి వద్దాం.
    ప్రస్తుతం సమాజంలో బ్రాహ్మణులు అనే పిలవబడుతున్న ఈ షో కాల్డ్ పండితులు కు గాని ఏ స్వామీజీ కి గాని ఏ మఠాధిపతి పీఠాధిపతులు కైనా గాని ఏ వేద పాఠశాలలు నిర్వహిస్తున్నటువంటి గురువులకు గాని వేద పండితులనీ ఘణాపాటిలము అని అవధానం చేసిన వాళ్ళమనీ చెబుతూ తిరుగుతున్న వ్యక్తులకు గాని ఈ బ్రహ్మ జ్ఞానం లేనందున బ్రాహ్మణులు కాలేరు. ఒకవేళ వేదమంత్రాలు కొన్ని కంఠస్థం చేసినందుకు విప్రులు అనబడతారే గాని బ్రాహ్మణులు అని చెప్పుకునే అర్హత వారికి లేదు కనుక వీరు ఎవరూ బ్రాహ్మణులు కారు. పరమాత్మ విశ్వకర్మను ఆరాధించిన వాళ్లే తన యొక్క విభూతులు ప్రజలకు తెలియజేస్తూ విశ్వకర్మ భక్తి తత్వాన్ని ప్రజల్లో ప్రచారం చేసిన వాడే నిజమైన బ్రాహ్మణులని వేదముల సాక్షిగా నిరూపించబడుతుంది..
    పైన చెప్పబడిన 6 సృష్టి సూక్తముల లో పురుష సూక్తం గురించి కొన్ని ముఖ్యమైన మంత్రాలు నేను వివరించి చాలా వీడియోలు చేశాను. మన సనాతన వైదిక జ్ఞానం SANATANA VAIDIKA GNANAM అనే యూట్యూబ్ ఛానల్ లో వైదిక రహస్యాలు ఎన్నో తెలియజేశాను.
    ఇంకా అదువేదంలో పురుష సూక్తము లో ఉన్న మంత్రం ప్రకారం….. “బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూ రాజన్యః కృతః |
    ఉరూ తదస్య యద్వైశ్యః పద్మ్యాగ్ం శూద్రో అజాయత…”
    పురుష సూక్తములో పురుషుడు ముఖము నుండి పుట్టిన వారే బ్రాహ్మణులు మరియు తన యొక్క బాహువుల నుండి ఉద్భవించిన వారు క్షత్రియులని తన యొక్క తొడల నుంచి ఉద్భవించిన వారిని వైశ్యులనియు తన యొక్క పాదముల నుంచి పుట్టిన వారు శూద్రులని ఈ మంత్రం పేర్కొంటుంది. అనగా పురుష సూక్తము లోని ఈ మంత్రము ద్వారా మనుషులను వారు గుణకర్మములు బట్టి వృత్తిని ఆధారంగా విభజించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే చతుర్వర్ణముల గురించి తెలియజేశారు.అ
    అప్పుడు పురుషుడు పరమాత్మ విశ్వకర్మ అని అదే సూక్తంలో ఈ మంత్రము – ” అద్భ్యః సంభూతః పృథివ్యై రసాస్చ విశ్వకర్మణః స్సమవర్థతాధి |
    తస్య త్వష్ణా విదద్రూప మేతి పురుషస్య విశ్వమాజాన మగ్రే..” ….. యజుర్వేదంలో పురుష సూక్తం.
    ఈ మంత్రార్థము:
    నీటి నుంచి ఉద్భవించిన భూమిని పృథ్వి గా ప్రతిష్టాపన చేసిన విశ్వకర్మ భగవానుడు సమవార్థతాది అనగా తన సృష్టి అంతర్నే సమాన దృష్టితో చూసేవాడు అని అర్థం అనగా అన్ని జీవులు కూడా తన ప్రజలే దేవతలు మానవులు పశుపక్ష కీటకాదులు అన్నీ కూడా ఆయన దృష్టిలో సమానమే అంతా ఆయన బిడ్డలే. తర్వాత జననంలో అతను త్వష్ట ప్రజాపతి మొదలైన రూపములను తానే ధరించి ఈ విశ్వం ప్రారంభం నుంచి తుది వరకు వ్యాపించి ఉన్నాడు అని అర్థం.

అని ఈ మంత్రము ద్వారా పురుష సూక్తుంలో పురుషుడు పరమాత్మ విశ్వకర్మ అనే స్పష్టంగా తెలియజేయుచున్నది. చతురవర్ణములు పరమాత్మ విశ్వకర్మ దేహం నుంచి వచ్చినవే కనుక వేదములలో వేద కాలములో మానవులలో జాతి భేదం లేకుండా ఉండేది. విశ్వకర్మ ప్రజాపతి తన సృష్టించిన సృష్టిని కాపాడేందుకు అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా తన ఐదు ముఖముల నుండి ఐదుగురు బ్రహ్మలను సృష్టించాడు వారే ….
సద్యోజాత ముఖము నుండి మనుబ్రహ్మను – పౌరాణిక నామము శివుడు .
వామదేవ ముఖం నుండి మయ బ్రహ్మను – పౌరాణిక నామము విష్ణువు.
అఘోర ముఖము నుండి త్వష్ట బ్రహ్మను – పౌరాణిక నామము బ్రహ్మ.
తత్పురుష ముఖము నుండి శిల్పి బ్రహ్మను – పౌరాణిక నామము ఇంద్రుడు.
ఈశాన ముఖము నుండి విశ్వజ్ఞ బ్రహ్మను పౌరాణిక నామము సూర్యుడు.
అనే పంచ బ్రహ్మలను మానస పుత్రులుగా సృష్టించారు.
ఈ పంచ బ్రహ్మలు వారి అనుకూలత కోసం సహాయము కోసము ఒక్కొక్క బ్రహ్మ వరుసగా పంచ వృత్తుల అది దేవతలైన అవ్యక్త బ్రహ్మర్షులు (అనగా కనిపించని దేవత స్వరూపమైన పూర్వ ఋషులు) ఐనటువంటి సానగ, సనాతన , అహబూన , ప్రత్న , సుపర్ణ బ్రహ్మర్షులను పంచ బ్రహ్మల యొక్క మానస పుత్రులుగా సృష్టించడం జరిగింది వీరు వరుసగా అయో శిల్పము , దారు శిల్పము , శిలా శిల్పము , లోహ శిల్పము , స్వర్ణశిల్పము అనే పంచ వృత్తుల ద్వారా విశ్వకర్మ సృష్టించిన సృష్టిని కాపాడి అభివృద్ధి పరిచేందుకు వీరి పరంపరులో పుట్టిన శిల్ప వర్గాల ప్రజలు అనగా విశ్వకర్మ వంశీయులను ఉపయోగించుకుని దేవతలకు కావలసిన రథములు , హర్మ్యములు , మందిరములు , మానవులకు కావలసిన నగరములు పట్టణములు రక్షణ యుద్ధ సామాగ్రి , యుద్ద యంత్రాలు , శస్త్ర అస్త్రాలు , రకాలు పుష్పక విమానాలు , నదులకు ఆనకట్టలు , వ్యవసాయ ఉపకరణాలు , బట్టలు నేసే యంత్రాలు , మానవుడికి నిత్య అవసరానికి కావలసినటువంటి ఉపకరణాలు , శాస్త్రీయ సాంకేతిక విజ్ఞాన విద్యల కోసం నలంద , తక్షశిల లాంటి గురుకులాలు నిర్వహించి అన్ని రకముల విద్యలు బోధిస్తూ , భౌతిక , రసాయన శాస్త్రము , వైద్యశాస్త్రము మొదలైన యుద్ధ విద్యలు అన్ని రకాల విద్యలు నేర్పి ప్రజలను విజ్ఞానవంతులుగా చేస్తూ విశ్వకర్మ సృష్టిని కాపాడుతూ ఇప్పుడు ప్రజలు ఆధునిక సదుపాయాలతో సుఖంగా జీవించేందుకు పునాదులు వేసిన వారే ఈ విశ్వకర్మ వంశ వైజ్ఞానిక సాంస్కృతిక పరంపరలో వచ్చిన విజ్ఞానులు.
వీరే భూమి సృష్టి ఆరంభం నుంచి చక్రవర్తులు గాను రాజులు గాను రాజు గురువుగారు మంత్రులుగాను సైన్యాధికారులను వైద్యాధికారులను విత్తాధికారులగాను ప్రధాన భూమిక లను పోషిస్తూ ప్రజలను కాపాడుతూ అన్ని విధాలా రక్షిస్తూ లోక సంగ్రహమును చేసారు. దీనికి సంపూర్ణ ఆధారాలు వేదములు. ప్రచారం చేయబడని చరిత్ర .
విశ్వకర్మ వంశీయులు కేవలం ఒక జాతిగా కాకుండా సృష్టిని కాబడి ప్రజలను రక్షించిన భూలోక దేవతలు అనగా భూసురులు అని గౌరవిస్తూ సకల ప్రజలు కృతజ్ఞత చూపిస్తూ గౌరవం భక్తి శ్రద్ధలతో పూజించాలి. ప్రజలందరూ వీరికి రుణగ్రస్తులై ఉండాలని అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. విశ్వకర్మ వంశీయుల పరంపర మీరు గమనించినట్లయితే నేరుగా పరమాత్మ విశ్వకర్మ పంచముఖముల నుంచి ఉద్భవించినటువంటి బ్రాహ్మణులు అని వేదము పురుష సూక్తము ద్వారా తెలియజేస్తుంది.. బ్రాహ్మణులు అనగా జాతి కాదని జ్ఞానము విజ్ఞానము కలిగినటువంటి ఒక విజ్ఞాన వర్గం అని ప్రజలు గ్రహించాలి. ఇంతటి పరంపర ఉన్నటువంటి విశ్వకర్మ వంశీయులను షో కాల్డ్ పండితులు సెలబ్రిటీలు బ్రాహ్మణులు అనే అనిపించుకుంటున్నవారు వీరిని కేవలం అవమానించాలనే ఉద్దేశంతో విశ్వకర్మ వంశీయుల యొక్క స్థానాన్ని ఆక్రమించి కపట నాటక మోసములతో ప్రజలను మైండ్ వాష్ చేసి తప్పు ద్రోవ పట్టించి అప్పటి రాజులను కుటిల ఉపాయములతో వశపరుచుకుని ఆకాలంలో లక్షల మందిని చంపించి ఊచకోత కోయించారు. అప్పుడు విశ్వకర్మ వంశ విజ్ఞానులు వారి యొక్క ప్రాణములు కాపాడుకునుటకై చేసిన మేలు మరిచి విశ్వాస రహితంగా ఉన్నందుకు ఈ ప్రజలపై విరక్తి పొంది అప్పటికే వారి వద్ద ఉన్నటువంటి పుష్పక విమానాలు జలాంతర్గాములు అణిమాది అష్టసిద్ధులను ఉపయోగించి వేరే దేశానికి వారి యొక్క విజ్ఞాన గ్రంథములు పంచమ వేదమైనటువంటి రహస్యమైన విజ్ఞానదాయకమైన ప్రణవవేదాన్ని పట్టుకొని వలస వెళ్లిపోయారు . అందుకే ప్రస్తుతం మన దేశం కన్నా ఇతర దేశాలు మన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంతగా డెవలప్ అయ్యాయి. అదంతా భారతదేశ పరిజ్ఞానమే.
ఈ విధంగా వీరి జనసంఖ్య తక్కువ చేసి రాజ్యాల నుంచి వీరి ప్రభావం తగ్గించి విదేశీయులకు సహాయం చేస్తూ మన దేశ రహస్యలను వారికి చెబుతూ వారిని ఉపయోగించుకుని వీరు స్థానాన్ని పధిలపరుచుకుని మన దేశం చిన్నాభిన్నం అవ్వడానికి మన దేశంలో ఉన్న అమూల్య సంపదలు విదేశీయులు దోచుకోవడంలో సహాయపడ్డారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది చాలామంది చరిత్రకారులు కూడా ఈ విషయం పట్ల పరిశోధన చేసి చెబుతున్నారు. ఈ స్వార్థపూరిత వర్గం గౌతమ బుద్ధుడు కాలమునంతర పురాణములు రచించి ఆ పురాణముల ద్వారా దేవతల పేర్లతో కొట్టుకు చచ్చేలా అనాగరిక వ్యవస్థను సృష్టించి సనాతన ధర్మీయుల్ని దేవతల పేర్లతో జాతుల పేర్లతో విడదీశారు.
వేదములలో జాతులు లేవు ఉండేవి రెండే జాతులు అది స్త్రీ మరియు పురుషుడు. ప్రస్తుతం సమాజంలో షో కాల్డ్ బ్రాహ్మణులుగా పిలవబడుతున్న వారి మూలములను అనగా వారి యొక్క గోత్ర ఋషులను పరిశీలించితే వీరెవరూ బ్రాహ్మణ ఇళ్లల్లో పుట్టలేదు. వారి యొక్క మూలపురుషులందరూ అనగా గోత్ర రుషులందరూ తక్కువ సంకరజాతి వారుగా వజ్ర సూచీ ఉపనిషత్తు తెలియజేయుచున్నది.
వీరికి మూలపురుషుడు అయినటువంటి వశిష్ఠుడు ఒకవేశ్యకు పుత్రుడు ఇతను మతంగ ముని యొక్క పుత్రిక అయినటువంటి అరుంధతి అని మాదిగ అమ్మాయిని వివాహం చేసుకుంటారు ఆమె గొప్ప ప్రతివ్రత గాను కీర్తి శిఖరాలను అధిరోహించారు.
వశిష్టుడు తపస్సు చేసి గొప్ప ఋషిగా పేరు తెచ్చుకుంటారు. వీరి పుత్రుడు శక్తిమని శ్వపచల కుటుంబం నుండి చండాలాంగణ కన్యను వివాహం చేసుకుంటాడు.
తర్వాత పరాశరుడు నది దాటుతుండగా బెస్ట్ పల్లె పరచు చేపలు పట్టే బెస్త జాతి అమ్మాయైన సత్యవతి నదిలో పొడవైన నడుపుతుండగా నది గర్భం మధ్య చేరుకునేసరికి ఒంటరిగా ఉన్న ఆమెను చూసి మోహించి బలత్కారం చేయగా పుట్టినవాడు వ్యాసుడు ఈ వ్యాసుడే అష్టాదశ పురాణాలను రచించాడని మన పూర్వీకుల ఉవాచ. వశిష్ఠుడు , శక్తి ముని,పరాశరుడు, వ్యాసుడు , జంభూకుడు , శుకుడు , గౌతముడు , మండుకుడు మొదలైన వీరంతా పుట్టుకతో బ్రాహ్మణులు కాదు వారు విద్యలను అభ్యసించి తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొంది ఋషులుగాను మానవ జీవనం పరమార్థం తెలుసుకున్న మహానుభావులు గాను కీర్తిని పొందారు.
మీరు ఎక్కడా మేము బ్రాహ్మణులము అని చెప్పుకోలేదు.ఇక నిజమైన బ్రాహ్మణులు ఎవరు అనే విషయానికి వద్దాం.పరమాత్మ విశ్వకర్మ ముఖం నుంచి పుట్టినటువంటి సమస్త మానవ కోటికి రక్షణా పోషణ పరిపాలన విద్యా వైద్య అన్ని రంగంలోనూ అభివృద్ధి పరిచేందుకు తన యావత్తు జీవితాన్ని అంకితము చేసి కృషి చేసినటువంటి ఈ లోకహితులే నిజమైన బ్రాహ్మణులు. వారే ప్రస్తుత సమాజంలో విశ్వబ్రాహ్మణులుగా ప్రభుత్వ జాతి గజట్లో గుర్తింపబడుతున్నారు.
కొంతమంది స్వార్థపరులు విశ్వాసఘాతకులు ఇటువంటి మహానుభావులను వృత్తుల పేర్లతో ఏక వజ్రంతో పిలుస్తూ అడుగడుగునా వీళ్ళని అవమాన పరుస్తూ శునకానందాన్ని అనుభవిస్తున్నారు.
ఇది నిజమైన భారత దేశ చరిత్ర ప్రపంచ చరిత్ర ఆన్ టోల్డ్ హిస్టరీ అని మనము చెప్పవచ్చు.
నశేషం.
ఇట్లు మీ యొక్క ఆధ్యాత్మిక గురువులు
అంతర్జాతీయ వైశ్వకర్మణ ధార్మిక పరిషత్తు
సంస్థాపక అధ్యక్షులు మరియు గురువులు
వేద బ్రహ్మశ్రీ ఆచార్య టి మోహనరావు శర్మ స్థపతి, వేదాధ్యాయీ , శిల్పశాస్త్ర పండితులు , శిల్పశాస్త్ర ఉపన్యాసకులు , జ్యోతిష్య విద్వాంసులు నాడీ జ్యోతిష్య పండితులు, వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు, పౌరోహిత్య ఆద్వర్యులు ,పురాణ ఇతిహాస పరిశోధకులు, సకల దేవతా దేవాలయాల ప్రతిష్టాపన ఆచార్యులు బెంగళూరు 9341265719.

.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version