నారద వర్తమాన సమాచారం
మాచర్ల అత్యాచార ఘటనలో కొత్త కోణం – సీసీటీవీలో అనుమానితుడు గుర్తింపు
పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం రేపిన అత్యాచార ఘటన దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
తాజాగా బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజీలో బాధితురాలి ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి గుర్తించారు. అదే వ్యక్తి గుంటూరు బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న దృశ్యాలు కూడా లభ్యమయ్యాయి. దీంతో అతడే నిందితుడిగా పోలీసులు అనుమానిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు.
ఇప్పటికే బాధితురాలితో మాట్లాడిన పోలీసులు కీలక వివరాలు సేకరించారు. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది.
త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








