Thursday, April 23, 2026
spot_img

పి.జి.ఆర్.ఎస్ ను వినియోగించుకోండి.. జిల్లా కలెక్టర్ సి ఎమ్.సాయి కాంత్ వర్మ

నారద వర్తమానం సమాచారం

పి.జి.ఆర్.ఎస్ ను వినియోగించుకోండి.. జిల్లా కలెక్టర్ సి ఎమ్.సాయి కాంత్ వర్మ

గుంటూరు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ కోరారు. ప్రతి సోమవారం పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లను ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ
దరఖాస్తులను పి.జి.ఆర్.ఎస్ తో పాటు
మీకోసం”వెబ్ సైట్ లో ఆన్ లైన్ లోను అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు. అర్జీల వివరాలు  
Meekosam.ap.gov.in
(మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఆర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.
పి.జి.ఆర్.ఎస్ తో పాటు నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ లను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version