నారద వర్తమాన సమాచారం
విజయం ట్రస్ట్ మరియు బెల్లంకొండ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం…
విజయం ఫౌండేషన్( ట్రస్ట్)మరియు వాసవి మణికంఠ క్లబ్& బెల్లంకొండ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో, విజయ కోస్టల్ కేర్ & శ్రీ సాయి హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం:- సత్తెనపల్లి పట్టణ మేదర సంఘం రామాలయం నందు ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. విజయం ఫౌండేషన్ ( ట్రస్ట్) వాసవి మణికంఠ క్లబ్, & అండ్ బెల్లంకొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, విజయ కోస్టల్ కేర్, శ్రీ సాయి హాస్పిటల్ సహకారంతో, అన్ని రకముల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన డాక్టర్లచే ఉచిత మెగా వైద్య శిబిరం, చాలా ఘనంగా నిర్వహించడమైనది.ఉచిత ఈసీజీ, కంటి ఉచిత పరీక్షలు, ఉచితముగా మెడిసిన్, కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగినది. కార్యక్రమంలో విజయం ఫౌండేషన్, (ట్రస్ట్ )తుమ్మల. వెంకటేష్, కోఆర్డినేటర్ సంఘబత్తుల రాజేష్, వాసవి మణికంఠ క్లబ్ కొప్పురావూరి వెంకట సుబ్బారావు, బెల్లంకొండ చారిటబుల్ ట్రస్ట్ బెల్లంకొండ నాగ సాయి ప్రసాద్, మరియు వైద్యులు ప్రకాష్ కొండపల్లి, గుండె సంబంధిత వైద్య నిపుణులు, డాక్టర్ ప్రభాకర్, దీర్ఘకాలిక వ్యాధి నిపుణులు, కూరేళ్ల శ్రావణ్ కుమార్, మెదడు వెన్నెముక వైద్యునిపుణులు, కూరేళ్ల లత, స్త్రీ సంబంధిత వైద్యులు, యశ్వంతి ఊపిరి తీత్తులు వైద్యనిపుణులు షేక్ పాషా కంటి వైద్యునిపుణులు, హాస్పిటల్ బృందం రామకృష్ణ,టీమ్ లీడర్ శ్రావణ్ కుమార్ సురక్ష కన్సల్టెన్సీ, సురేష్ మరియు హాస్పటల్ సిబ్బంది. పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








