నారద వర్తమాన సమాచారం
పిజిఆర్ఎస్ అర్జీలను సత్వరం పరిష్కరించాలి జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ
కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించగా, ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ అర్జీలను స్వీకరించారు.
జిల్లా ఇంచార్జి కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ ,ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 119 అర్జీలను స్వీకరించడం జరిగింది. ఇందులో అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని అధికారులకు అక్కడికక్కడే జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ పిజిఆర్ఎస్ అర్జీలను సత్వరం అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. ఆయా శాఖల అధికారులు గడువులోపు అర్జీలను పరిష్కరించడం చేయాలన్నారు. ప్రతిరోజు అర్జీలను మానిటర్ చేయాలని, గడువు తీరకముందే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చేయాలని ఆదేశించారు. అర్జీలను ఎలాంటి పెండింగ్ ఉంచరాదని, పెండింగ్ ఉన్న అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ అర్జీలను ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని ఆదేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








