నారద వర్తమాన సమాచారం
రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్
రాష్ట్ర వ్యాప్తంగా రేపు మందుల దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది.
అత్యవసరంగా అవసరమయ్యే మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని ప్రజలకు సూచించింది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, ప్రతిరోజూ మందులు వాడేవారు తమకు అవసరమైన ఔషధాలను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.
మెడికల్ షాపుల బంద్ కారణంగా సాధారణంగా అందుబాటులో ఉండే మందులు రేపు దొరకకపోవచ్చని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








