నారద వర్తమాన సమాచారం
విదేశాల్లో దేశ కీర్తిని రేవంత్ దెబ్బతీస్తున్నారు : ఈటెల
సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. రేవంత్ అమెరికా పర్యటనను రాజకీయ కారణాలతో కేంద్రం అడ్డుకుందని చెప్పడం సరికాదన్నారు. లండన్ పర్యటనలో దేశ విచ్ఛిన్న శక్తులను రేవంత్ కలిశారని ఆరోపించారు. విదేశాల్లో దేశ కీర్తిని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం సహకారంతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందన్నారు. అబద్ధాలతో ప్రజలను రేవంత్ మభ్యపెడుతున్నారని విమర్శించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








