నారద వర్తమాన సమాచారం
గుంటూరు లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ దాడులు
గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,టాస్క్ ఫోర్స్, ఎస్బీ సి ఐ 1 మరియు నల్లపాడు పోలీసుల సమన్వయంతో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై దాడి నిర్వహించారు.
29.09.2026 మంగళవారం మధ్యాహ్నం సుమారు 03:50 గంటలకు, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫేజ్-1 రింగ్ రోడ్, 1వ లైన్లో ఉన్న దేవి గెస్ట్ రూమ్స్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అందిన సమాచారంతో దాడి చేపట్టారు.
టాస్క్ ఫోర్స్ సీఐ కీ సమాచారం అందించి, ఎస్బీ సీఐ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్, ఎస్బీ సిబ్బంది మరియు నల్లపాడు ఎస్ఐ కృష్ణబాజీ తమ సిబ్బందితో కలిసి గెస్ట్ రూమ్స్‌లోని రూమ్ నంబర్ 102పై దాడి నిర్వహించారు.
టాస్క్ పోర్స్ దాడిలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 6 మంది మహిళలు స్థానిక మహిళ మంది విటులు లాడ్జి మేనేజర్
వెరసి మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
అదేవిధంగా 11 సెల్ఫోన్లు, 45 కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు. (ఆర్గనైజర్ లక్ష్మి, శ్రీనగర్, గుంటూరు.)
అదుపులోకి తీసుకున్న వారిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ మరియు చట్టపరమైన చర్యల నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








