నారద వర్తమాన సమాచారం
ఘనంగా నవ యువతరం ఫౌండేషన్ ఆరవ వార్షికోత్సవ వేడుకలు……
ఘనంగా నవయువతరం ఫౌండేషన్ 6 వ వార్షికోత్సవ వేడుకల లో భాగంగా సమాజానికి తమ వంతు సేవలను అందించాలని ఫౌండేషన్ వార్షికోత్సవం మరియు గాంధీ జయంతి సందర్బంగా వివిధ ప్రాంతాలలో సేవకార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కార్యక్రమల లో భాగంగా విజయ సాయి స్త్రీల సంతాన సాఫల్య కేంద్రం హాస్పిటల్ గుంటూరు వారి గైనకాలజిస్ట్ యమ్ పద్మజా తో స్త్రీలకు ఆన్లైన్ వెబినార్ మరియు
పిడుగురాళ్ల లోని జమున స్కూల్ లోని రెండు వందల మంది విద్యార్థులకు పుస్తకాలు, వ్రాత సామాగ్రి, ఫ్రూప్ట్స్ స్నాక్స్ పంచడం మరియు గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం లో వాసవి మెంబర్ కొత్త అరుణ,
కే సాయి ప్రకాష్,గుండా సునీత, కాత్యాయిని, సైదరావు,ఆదిలక్ష్మి, అన్నపూర్ణ లక్ష్మి, షేక్ షఫీ, షేక్ సిరాజ్,యమ్ పవన్,ఫౌండేషన్ ప్రెసిడెంట్ చిగుళ్ల సుమలత కార్యక్రమంలో భాగస్వమ్యూలు గా నిలిచి కార్యక్రమాన్ని దిగ్విజయం గా పూర్తి చేశారు. పాఠశాల హెచ్ యమ్ ఆర్ రక్కు నాయక్ నవ యువతరం ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న సేవలు సమాజానికి ఎంతగానో ఉపయోగమని ఫౌండేషన్ ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలను ప్రశంసించారు ఇలాంటి మరెన్నో సేవ కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆయన కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








