నారద వర్తమాన సమాచారం
విజయవాడ రైల్వేస్టేషన్ లో డ్రగ్స్ కలకలం రేపింది….
విజయవాడ రైల్వేస్టేషన్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఓ యువతి వద్ద డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువతిని ఈగల్, జీఆర్పీ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆమె వద్ద 110 గ్రాముల ఎండీఎంఏ సింథటిక్ డ్రగ్స్ లభ్యమయ్యాయి. వాటి విలువ సుమారు 11 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సదరు యువతి డ్రగ్స్ ను బెంగళూరు నుంచి విజయవాడకు తీసుకొస్తున్నట్లు గుర్తించారు. యువతి జైలులో ఉన్న తన ప్రియుడు వర్థన్ ను బెయిల్ పై విడుదల చేయించేందుకు డ్రగ్ కొరియర్ గా మారిందని పోలీసులు తెలిపారు. విజయవాడకు చెందిన పాత నేరస్తుడు బషీర్ కోసం బెంగళూరు నుంచి విజయవాడకు నాగసౌమ్య డ్రగ్స్ రవాణా చేసినట్లు వెల్లడించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








