నారద వర్తమాన సమాచారం
పెళ్లి ఖర్చుల కోసం ఓ ప్రేమజంట చైన్ స్నాచింగ్..
ప్లాన్ వికటించి పోలీసులకు దొరికిపోయారు..
హైదరాబాద్లో పోలీసులకు పట్టుబడిన ఆంధ్రా ప్రేమ జంట..
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వెల్దుర్తికి చెందిన రమణారెడ్డి, వరలక్ష్మి..వీరు హైదరాబాద్లోని గుర్రంగూడలో సహజీవనం చేస్తున్నారు..
తాము ప్రేమ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో..అక్టోబర్ 18న హస్తినాపురంలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో పూజలు చేస్తున్న 66 ఏళ్ల వృద్ధురాలు అందుగుల రాములమ్మ మెడలోని 30 గ్రాముల (రెండు తులాల) బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు..
సీసీటీవీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేసిన వనస్థలిపురం పోలీసులు.. నిందితులను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు..
వారి నుంచి బంగారు పుస్తెలతాడుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








