Friday, November 27, 2026
spot_img

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

నారద వర్తమాన సమాచారం

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

పల్నాడు జిల్లా, నవంబర్ 27: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పోక్సో కేసులో నిందితుడు బోజ్జా నాగమల్లేశ్వరరావు (68)కు గుంటూరు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

నేకరికల్లు మండలం ఉదయ్‌నగర్ కాలనీకి చెందిన నిందితుడిపై నమోదైన సెషన్స్ కేసు నంబర్ 606/2024లో నేరం రుజువు కావడంతో ప్రత్యేక న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం తీర్పు వెలువరించారు.

పోక్సో చట్టంలోని సెక్షన్ 6 r/w 5(l)(m) కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా, సెక్షన్ 10 కింద ఐదేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. ఐపీసీ 506 కింద ఆరు నెలల సాధారణ జైలు శిక్షను కూడా విధిస్తూ, అన్ని శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించారు.

బాలలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు ఎస్పీ జగదీష్ ఆదహళ్లి, ఐపీఎస్ తెలిపారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్, నకిరేకల్ ఎస్సై సతీష్‌తో పాటు కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading