నారద వర్తమాన సమాచారం
టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసిన : జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఎమ్మెల్యే యరపతినేని……
పిడుగురాళ్లలో మొదటి ఫేజ్ లో 1277 మందికి టిడ్కో ఇళ్ల అందజేత
కొండమోడులో టిడ్కో ఇళ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని కొండమోడు టిడ్కో ఇళ్ల సముదాయంలో సోమవారం సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొని, లబ్ధిదారులను సత్కరించి ఇళ్ల తాళాలను అందజేశారు.
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ మంజూరైన 2832 ఇళ్లకు గానూ 1277 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.83 కోట్లు, వసతుల కల్పన కోసం రూ.14 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.
లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం మహిళల పేరిట మంజూరు చేసిన ఇళ్లలో లబ్ధిదారులే నివాసం ఉండాలని, వీటిని మీ కుటుంబానికి ఆస్తిగా, వారసత్వంగా ఇవ్వాలే తప్ప అమ్మాలనే ఆలోచన చేయవద్దన్నారు.
లబ్ధిదారులందరూ వెంటనే టిడ్కో ఇళ్లలోకి మారకపోతే కాలనీలు అసాంఘిక కార్యకలాపాలకు, దొంగతనాలకు ఆస్కారం ఉంటుందన్నారు. కాలనీలో వసతుల కల్పన, నిర్వహణ కోసం లబ్ధిదారులందరూ ఒక సొసైటీగా ఏర్పడి కృషి చేయాలన్నారు.
లబ్ధిదారులు టిడ్కో కాలనీల్లో నివసిస్తే ప్రత్యేకంగా రేషన్ దుకాణాన్ని కూడా ఏర్పాటు చేయడంతో పాటూ భవిష్యత్తులో కమ్యూనిటీ పార్కు, అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రం వంటి సౌకర్యాలను కల్పిస్తామన్నారు.
కొండమోడు టిడ్కో సముదాయంలో ఇళ్ల నిర్మాణ వివరాలను కలెక్టర్ వెల్లడించారు:
పేదల సొంతింటి కల నెరవేరుతోంది: ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని అన్నారు. “2016లో ఈ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి, ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు రాష్ట్రవ్యాప్తంగా గృహప్రవేశాలకు శ్రీకారం చుట్టారు,” అని ఆయన పేర్కొన్నారు. ఫేజ్ 2 పనులను కూడా త్వరలోనే పూర్తి చేసి మిగిలిన లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








