Saturday, May 2, 2026
spot_img

వరికిపూడి శెల ప్రాజెక్టును ప్రారంభించాలని లేకుంటే దీక్షఅనుమతులు ఇవ్వాలి.పల్నాడు జిల్లా కలెక్టర్,ఎస్పీకి వినతి.

నారద వర్తమాన సమాచారం

వరికిపూడి శెల ప్రాజెక్టును ప్రారంభించాలని లేకుంటే దీక్ష
అనుమతులు ఇవ్వాలి.పల్నాడు జిల్లా కలెక్టర్,ఎస్పీకి వినతి.

వరికపుడిశెల ప్రాజెక్టు త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతూ వరికపుడిసెల జలసాధన సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పార్క్ సెంటర్లో 3వ తేదీ నుండి 10 రోజులు రిలే నిరాహార దీక్ష చేయుటకు అనుమతి ఇవ్వాలని పల్నాడు జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో వెల్దుర్తి దుర్గి మాచర్ల కారంపూడి బొల్లాపల్లి పుల్లలచెరువు మండలాల నుండి సుమారు 20 మంది సభ్యులతో కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నామని తెలియజేశారు. అదేవిధంగా మైక్ అనుమతులు ఇవ్వాలని కోరారు

రైతు ఆత్మహత్యలు:

గత ప్రభుత్వములో 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న
వెల్దుర్తిమండలంలో 39 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా ఎక్కువ కౌలు రైతు భరోసా అందుకున్న మండలం వెల్దుర్తి అని ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేశారు.ఇటీవల కాలంలో18 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు.ఉగాది పండుగ తర్వాత ఒకే మండలంలో రెండు వారాల సమయంలో ముగ్గురు రైతుల వెల్దుర్తి మండలంలో ఆత్మహత్య చేసుకున్నారు.సుమారుగా కూటమి ప్రభుత్వ 20 నెలల కాలంలో రాష్ట్ర మొత్తం వెల్దుర్తి మండలంలోనే చేసుకున్నారు. విధంగా ఇటీవల కాలంలో 9 మంది రైతులు చేసుకున్నారు
పల్నాడు పరిస్థితి.
కృష్ణానదికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్నాడు పల్లెలు, గ్రామాలు, గిరిజన తండాలు త్రాగునీటికి నోచుకోక తల్లడిల్లుతున్నాయి.
భూగర్భ జలాలు అడుగంటిపోయి దాదాపు 1500 అడుగుల లోతులో బోర్లు వేసినా నీళ్లు పడటం లేదు.
పంటను కాపాడుకోవాలనే ప్రయత్నంలో రైతులు బోర్లు మీద బోర్లు వేసి నీళ్లు పడక, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
మరి కొందరు రైతులు, రైతు కూలీలు పొట్ట చేత పట్టుకొని వలసెల్లిపోతున్నారు.ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మరి కొద్ది సంవత్సరాల్లోనే ఈ ఎగువ పల్నాడు “ఎడారి” గా మారే పెను ప్రమాదం పొంచి ఉంది.కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో 1 సంవత్సరంలోనే వరికపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. కనీసం 2 సంవత్సరాలలో పనులు మొదలు పెట్టమని కోరుతున్నామని తెలిపారు.
వెల్దుర్తి మండల రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోకుండా వచ్చి ధైర్యం చెప్పాలని కలెక్టర్ ను రైతులు వేడుకున్నారు.వరికపుడిసెల ప్రాజెక్టు జీవో నెంబర్ 104 ప్రకారం ఫేజ్-1 పనులు వెంటనే ప్రారంభించేల చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరమన్నారు .ఈ కార్యక్రమంలో వరికపుడిసెల జల సాధన సమితి అధ్యక్షులు బత్తుల వీరయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి పల్నాడు శ్రీను,గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. శ్రీను నాయక్,గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. కోటా నాయక్,పిడియం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ వలి, శ్రీ వీరబ్రహ్మేంద్ర
జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గురజాల అప్పారావు పలువురూ నాయకులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading