నారద వర్తమాన సమాచారం
ఈ నెల 29న జరగనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని
అధికారుల ను ఆదేశించిన – జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల
జిల్లాలో ఈ నెల 29న జరగనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధత పైన అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫెరెన్స్
నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్రిటికల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన పోలింగ్ అధికారులు, నోడల్ అధికారులు, రూట్ అధికారులు, జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్ల నిబంధనల ప్రకారం పనిచేయాలి అన్నారు
ఎలాంటి ఉల్లంఘనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల ఏర్పాట్లు, కమ్యూనికేషన్ ప్లాన్, అవసరమైన వాహనాల సమీకరణపై చర్చించారు
ఎన్నికలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదుల స్వీకరణ, తక్షణ స్పందన కోసం కంట్రోల్ రూమ్‌తో పాటు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.ప్రత్యేక అవసరాలు గల ఓటర్ల సౌకర్యార్థం వీల్చైర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను సక్రమంగా పూర్తి చేసి, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
బ్యాలట్ పేపర్ లు భద్రపరిచే స్ట్రాంగ్ రూంలు ,పోలింగ్ మెటీరియల్ పంపింణి కేంద్రాలు వద్ద భద్రతా చర్యలు చేపట్టాలి అన్నారు
ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
కౌంటింగ్ సమయంలో ప్రతి రౌండ్ ఫలితాలను జాగ్రత్తగా నమోదు చేయాలని, తక్కువ ఓట్ల మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో చెల్లని ఓట్ల పరిశీలనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి అరగంటకు లేదా గంటకు ఒకసారి ఫలితాల సరళిని సమీక్షిస్తూ, స్వల్ప మెజారిటీ ఉన్న పంచాయతీలు, డివిజన్ల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








