ఎన్నికల ప్రచారంలో వినూత్నంగా దూసుకుపోతున్న జేబీపీ అభ్యర్థి :: జొన్నలగడ్డ
నారద వర్తమాన సమాచారం :సతైనపల్లి :ప్రతినిధి
స్థానికత..,యువకుడు..,విద్యావంతుడే ప్రచారస్త్రం
వలస పక్షుల నుంచి నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందామని పిలుపు
ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందన
స్మశానంలో ఆత్మలను ఓటు అడగటం…పాదచారుల చెప్పులు కుట్టటం…తాడిచెట్టెక్కి కల్లు తీయటం.., అట్లు పోయటం.,టీ పెట్టటం…కొలిమిలో మాలట్ కొట్టటం, వెల్డింగ్ పనులు ఇలా వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్. ప్రధాన పార్టీల అభ్యర్థులు మూసదోరణి లో ప్రచారం చేస్తుంటే అతను మాత్రం వారికి భిన్నంగా ప్రచారం చేస్తూ చాపకింద నీరులా దూసుకుపోతున్నాడు. వినూత్న ప్రచారానికి తోడు స్థానికుడు యువకుడు..విద్యావంతుడు కావటం వలస పక్షుల నుంచి నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామనే పిలుపు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైసీపీ..,తెదేపా, జనసేన., భారతీయ జనతా పార్టీ తదితర పార్టీల అభ్యర్థుల కంటే ముందుగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) అధినేత జడ శ్రావణ్ కుమార్ జొన్నలగడ్డ విజయ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఏడాదిన్నార క్రితమే ప్రకటించారు. దింతో అప్పటి నుంచే నియోజకవర్గంలో ఆయన ప్రజా క్షేత్రంలో తిరుగుతూ వారితో మమేకం అవుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన దగ్గర నుంచి ఓటర్లకు మరింత దగ్గరైందుకు ప్రత్యేకంగా ప్రచారాన్ని ప్రారంభించాడు.
స్మశానంలోఎన్నికల ప్రచారం..
ఓటర్ల జాబితాలో అవకతవకలు జాబితా పారదర్శకంగా లేదంటూ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారిలో మార్పు లేకుండా చనిపోయిన వారి పేర్లు సత్తెనపల్లి మండలం ఎన్నాదేవి గ్రామంలో 40 కి పైగా ఉన్నాయి. దీంతో స్మశానంలో సమాధుల వద్దకు వెళ్లి ఒక్కోక్క సమాది పైన కరపత్రాలు ఉంచి తనకు ఓటు వేయాలని ఆత్మలను ఓటు అడిగిన తీరు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అదేవిధంగా చర్మకారుల సమస్యలు, వారి న్యాయమైన డిమాండ్స్ తెలుసుకునేందుకు వారి చెంతకు వెళ్లి పాదచారుల చెప్పులు కుట్టటం. చిన్నతరహా పరిశ్రమ నిర్వహకులు ఎదుర్కొంటున్నా సమస్యలపై కొలిమిలో మలాట్ కొట్టటం, వెల్డింగ్ షాపులో వెల్డింగ్ పనులు చేశారు. వీధి వ్యాపారులు కొబ్బరి బొండాలు, చెరుకు రసం అల్పాహార, టీ దుకాణాల నిర్వాహకులతో మాటలు కలపటం తో పాటు కల్లు గీత కార్మికులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
బాధితుల తరుపున పోరాటాలు
సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో సుమారు 40 సంవత్సరాల నుంచి దళిత యువ రైతులు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే క్రమంలో దళిత యువ రైతుల తరపున పోరాటాలు చేసి ఆ భూమి వారికి ఉండేలా కృషి చేశారు.
అదేగ్రామంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఆదాయం రావట్లేదంటూ ఎస్సీ కాలనీలోన్ ఏర్పాటు చేస్తున్నడంతో కాలనీ వాసుల కు అండగా నిలబడి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు వచ్చి ఆ ప్రయత్నాన్ని విరవింపజేశారు. దసరా., బతుకమ్మ దీపావళి, వినాయక చవితి, సంక్రాంతి, ఉగాది, ముక్కోటి ఏకాదశి రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు..,క్రిస్మస్ పండుగకు పేదలకు శాంత క్లాజ్ వేషధారణలో బహుమతులు అందజేశారు. క్రైస్తవుల శ్రమల దినాల్లో చర్చిలో ప్రేమ విందు తదితర కార్యక్రమాలు నిర్వహించారు…
అయ్యప్ప మాల దారులకు ఉదయం బిక్షా ఏర్పాటు, దర్గా లో జరిగిన ప్రత్యేక దువా ఆయన పాల్గొని ప్రార్ధనలు చేయటం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటూ అన్ని వర్గాల వారితో కలిసిపోయారు. గుడిలో పూజలు..మసీదు…దర్గా చర్చి ల్లో ప్రార్థనలు.,బతుకమ్మ వేడుకల్లో కోలాట నృత్యం…ఇలా కుల, మతాలకు అతీతంగా ప్రజల్లో మమేకమై ఆధ్యాత్మికతే నా అభి ‘‘మతం’’ అంటూ కలిసిపోతున్నాడు.
ఇరువురు మాజీ మంత్రుల నడుమ బరిలో స్థానిక యువకుడు :
ఒకరు యాభైఐదు… మరొకరు ఇంచుమించు అదే సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్లు…కళాశాల చదువుకునే రోజుల నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టి నేటికీ కొనసాగిస్తూ రాష్ట్ర స్థాయిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.వారిరువురూ మాజీ మంత్రులు. తమ మాటల చాతుర్యంతో ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చడంలో దిట్టా… ఒకరు యాభైఐదు...మరొకరు ఇంచుమించు అటుఇటుగా అదే సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్లు...కళాశాల చదువుకునే రోజుల్లో నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టి నేటికీ కొనసాగుతూ రాష్ట్ర స్థాయిలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.. అలాంటీ గండరపెండెముల నాయకులతో స్థానికుడు...యువకుడు విద్యావంతుడు ఎన్నికల్లో పోటీ పడుతున్నాడు.. వినూత్న ప్రచారంలో చాపకింద నీరులా దూసుకుపోతున్నాడు...అతనే తెదేపా సత్తెనపల్లి నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ., అదేవిధంగా వైకాపా నుంచి తాజా మాజీ మంత్రి అంబటి రాంబాబు పోటీ పడుతున్నారు. వీరిలో కన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి పెదకూరపాడు లో వరసగా నాలుగు సార్లు గెలిచారు. 2009 లో అదే పార్టీ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఐదోసారి గెలిచి పలు శాఖల మంత్రిగా పనిచేశారు. అనంతరం భాజాపా అధ్యక్షుడుగా కొనసాగి ఇప్పుడు తెదేపా చేరి సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నాడు.అంబటి రాంబాబు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మృతి అనంతరం వైకాపా లో చేరి సత్తెనపల్లి నుంచి రెండు సార్లు పోటీ చేస్తే ఒకసారి ఓడిపోయారు. రెండో సారి గెలిచి మంత్రి అయ్యాడు. ముచ్చటగా మూడో సారి పోటీ చేస్తున్నాడు.. జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) పాత్రికేయుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ బరిలో నిలుచున్నారు. కళాశాల అధ్యాపకుడిగా (లెక్చరర్).. ఓ ప్రముఖ పత్రిక, ఛానల్ పాత్రికేయుడుగా.. న్యాయవాదిగా...ఇప్పుడు రాజకీయ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగాడు..ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్పూర్తితో అడుగులు వేశాడు. పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ పిలుపుతో రాజకీయాల్లో అడుగులు వేశాడు.పట్టణ, గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ స్థానికత...యువకుడు... విద్యావంతుడని ప్రజా సేవకై తొలి అడుగు వేస్తున్నా. నియోజకవర్గంలో పేదలకు తన వంతుగా ఆర్ధిక, న్యాయ సహాయం అందిస్తూ వారికి నేను ఉన్నానంటూ భరోసా కల్పిస్తున్నారు కోటు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తూ ప్రచారంలో పరుగులు పెడుతున్నాడు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.