నారదవర్తమానసమాచారం:అమరావతి:ప్రతినిధి
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్ మీనా మీడియా సమావేశం :
రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోంది .
ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందే.
సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలి.
ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం.
వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి.
46 మందిపై చర్యలు తీసుకున్నాం.
కొందరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించాం.
ప్రభుత్వ భవనాలపై నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించాం .
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదు.
ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుంది
సీ విజిల్ యాప్‌లో నమోదైన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నాం .
సీ విజిల్ ద్వారా ఎవరైనా ఫొటో, వీడియో తీసి పంపవచ్చు.
ఇప్పటి వరకు 1.99 లక్షల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌లు తొలగించాం.
385 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశాం .
. 3 రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నాం.
ప్రస్తుతం తనిఖీల్లో 173 బృందాలు పాల్గొంటున్నాయి .
డీఎస్సీపై విద్యాశాఖ వివరణ కోరాం .
డీఎస్సీ నిర్వహణపై సీఈసీకి లేఖ రాస్తాం.
ఉస్తాద్ భగత్‍సింగ్ సినిమా టీజర్ నేను చూడలేదు .
టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఈసీ అనుమతి తీసుకోవాల్సిందే.
రాజకీయ హింస జరగకుండా చూడాలన్నదే మా లక్ష్యం.
హింస రహిత, రీపోలింగ్ లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
గిద్దలూరు, ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు జరిగాయి.
ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలతో మాట్లాడుతాం.
ఎస్పీల వివరణతో పాటు నివేదిక చూశాక చర్యలు.