తెలంగాణ
ప్రజల్లో క్షయ పై అవగాహనను భారీ ఉద్యమo గా మార్చాలి
మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత*
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్
నారద వర్తమాన సమాచారం:లింగంగిరి: ప్రతినిధి:-
హుజూర్నగర్ మండల కేంద్రంలో లింగగిరి గ్రామంలో ప్రజల్లో క్షయ వ్యతిరేక కార్యక్రమాన్ని భారీ ఉద్యమంగా మార్చి అవగాహనను పెంపొందించాలని మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత అన్నారు. ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా లింగగిరి లో జరిగిన కార్యక్రమంలో ఈరోజు క్షయ వ్యాధి నిర్మూలన ర్యాలీ అనంతరం అవగాహన కార్యక్రమంలో లో ఆమె మాట్లాడుతూ క్షయ వ్యాధిని పూర్తిగా నివారించేందుకు ప్రభావవంతమైన చికిత్స అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. క్షయ వ్యాధిని కొందరు కలంకంగా భావిస్తున్నారని ఈ భ్రమను పోగొట్టుకొని మన చుట్టుపక్కన రెండు వారాలకు మించి దగ్గు, రాత్రి వేళల్లో చెమటలు పట్టడం, బరువు తగ్గటం, ఆకలి మందగించడం, తేమడ లో రక్తజీరలు వంటి లక్షణాలు కలిగినటువంటి వారు మీ దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరీక్షలు చేయిచుచుకోవాలని వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచిత మందులు రోగులకు పోషకాహార నిమిత్తం నెలకు 500 రూపాయలు వారి చికిత్స కాలంలో ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ పద్మ, హెచ్ ఈ ఓగజగంటి ప్రభాకర్, ఎస్ టి ఎస్మమత, ఇందిరాల రామకృష్ణ,
శ్రీనివాస్,ల్యాబ్ టెక్నీషియన్ రమేష్
ఆరోగ్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.