నారద వర్తమాన సమాచారం
భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) పట్టణ కమిటీ సమావేశం
స్థానిక శివయ్య భవన్ లో మహంకాళి సుబ్బారావు అధ్యక్షతన భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ) పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉలవలపూడి రాము మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పై నిరంతరం సిపిఐ పార్టీ పనిచేస్తుంది. ప్రజా పోరాటాల నిర్వహించడం కోసం ఇంటింటికి సిపిఐ పేరుతో నిధి వసూలు చేయాలని రాష్ట్ర పార్టీ సమితి పిలుపు మేరకు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మరియు పట్టణంలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలని కోరుతూ దశల వారి పోరాటాలు చేస్తామని, విద్యార్థులు ఉన్నత విద్యా కోసం గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు వెళ్ళుతున్నారని పట్టణంలో అగ్రికల్చర్, వెటర్నరీ,నర్సింగ్ కళాశాలఏర్పాటు చేయాలని మరియు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ అర్జీలు, సామాజిక పెన్షన్లు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతూ మార్చి 16వ తేదీ నుండి 24వ తేది వరకు అర్జీలు రాయించి ఈ నెల 24వ తేదీన మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని, శివయ్య స్తూపం చుట్టూ గార్డెన్ నిర్వహించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ ని కలిసి కోరుతామని తెలిపారు. వినుకొండలో ఉపాధి లేక బెంగళూరు. హైదరాబాద్ లాంటి దూరప్రాంతాలకు వలసలు పోతున్నారని 2000 సంవత్సరం ముందు ఉన్న ఉపాధి కూడా ఇప్పుడు లేకుండా పోయిందని గతంలో బండ్ల మోటు లో సీసపు గనులు ఉండేదని అదే విధంగా బొల్లాపల్లి మండలం లో పలకల క్వారీలు వినుకొండలో పలకల ఫ్యాక్టరీలు. డాల్ మిల్లు ఉండటం ద్వారా 15000 మందికి పైగా వినకొండలో ఉపాధి దొరికేదని అవన్నీ కూడా ప్రభుత్వం నిలిపి వేసిందని. డాల్ మిల్ ఉంటే కేవలం పేపర్ల పైన టెండర్లు వేసుకోవటం పేపర్లపైనే అంత జరిగి పోతుంది కనుక వినుకొండలో పరిశ్రమలు ఏర్పాటు చేసి వినుకొండ ప్రజలకు ఉపాధి చూపించాలని కనీసం 10,000 మందికి ఉపాధి దొరికే విధంగా చూడాలని ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది దసలవారీగా పోరాటం చేయాలని అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని ఇండస్ట్రియల్ వచ్చేవరకు పోరాటం . వార్డుల్లో ఉన్న ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి యొక్క పరిష్కారాలు అయ్యేవరకు రోజువారీగా పోరాటం చేయాలని కమిటీ నిర్ణయించింది .నిరంతరం పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ పనిచేస్తుంది రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో వినుకొండ మండలం కార్యదర్శి కొప్పురపు మల్లికార్జునరావు,సిపిఐ పట్టణ కార్యవర్గ నాయకులు కిషోర్, సారమ్మ, చీరాల ఆంజనేయులు, తోటనరసింహ రావు, నర్రావెంకటరత్నం, అలుగులశ్రీనివాసరావు, నరసింహ నాయక్ తదితరులు పాల్గొన్నారు
ఉలవలపూడి రాము
భారత కమ్యూనిస్టు పార్టీ
సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి
9490017947
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









