Friday, November 22, 2024

“బాబు సూపర్ 6”  శంఖారావం కార్యక్రమం – 22వ వార్డు (గాంధీనగర్) , పిడుగురాళ్ల పట్టణం

“శంఖారావం (బాబు సూపర్ 6)” కార్యక్రమం – 22వ వార్డు (గాంధీనగర్) వార్డు, పిడుగురాళ్ల పట్టణం

గ్రామం : 22వ వార్డు (గాంధీనగర్) మండలం : పిడుగురాళ్ల పట్టణం

నారద వర్తమాన సమాచారం:పిడుగురాళ్ళ:ప్రతినిధి

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “శంఖారావం (బాబు సూపర్ 6)” కార్యక్రమంలో భాగంగా గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలోని 22వ వార్డు (గాంధీనగర్) నందు గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి  యరపతినేని శ్రీనివాసరావు  “శంఖారావం (బాబు సూపర్ 6)” కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

మహిళ, రైతు, యువత, వెనుకబడిన తరగతుల సాధికారత, బలోపేతంతోపాటు ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పేదలను ధనికులుగా తీర్చిదిద్దడానికి తెలుగుదేశం పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి ఏజెండా “బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ (బాబు సూపర్ 6)” మ్యానిఫెస్టో గురించి ప్రజలకు తెలియపరచడానికి, ప్రజలను చైతన్యవంతం చేసి, 2024లో టిడిపి అధికారంలోకి వచ్చాక “బాబు సూపర్ 6” లోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని, ప్రతి ఒక్కరూ “బాబు సూపర్ 6” లోని పథకాలు అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించాలని, గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు , పిడుగురాళ్ల పట్టణంలోని 22వ వార్డు (గాంధీనగర్) నందు ఇంటింటికి తిరిగి ” బాబు సూపర్ 6″ మ్యానిఫెస్టో ప్రతి ఒక్కరికి వివరించి, 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, నారా చంద్రబాబునాయుడు ని ముఖ్యమంత్రిగా చెయ్యాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రజలను కోరడం జరిగింది.

“బాబు సూపర్ 6” పథకాలు:

1) యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి.

2) స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000

3) ప్రతి రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం.

4) ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు.

5) ప్రతి మహిళకి నెలకు రూ.1,500.

6) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.

ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణంలోని 22వ వార్డు (గాంధీనగర్)కు చెందిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు పిడుగురాళ్ల పట్టణంలోని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల/టౌన్, గ్రామ/వార్డు స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు పాల్గొనడం జరిగింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version