ఆంద్రప్రదేశ్
గొల్లపూడిలో ఆత్మీయ సమావేశం గ్రాండ్ సక్సెస్.
ఎమ్మెల్యే వసంత కోసం ఎదురుచూసిన అభిమానులు.
బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి విజయం తథ్యం.
నారద వర్తమాన సమాచారం:జి కొండూరు: .ప్రతినిధి.
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశం గ్రాండ్ సక్సెస్ అయింది. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రాక కోసం టీడీపీ శ్రేణులు, అభిమానులు, ఎదురుచూశారు.
మైలవరం నియోజకవర్గ బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గొల్లపూడిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులు స్థానిక నాయకులు కార్యకర్తలను ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కి పరిచయం చేశారు. వారందరిని ఆప్యాయంగా పలకరిస్తూ మరి యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు.ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ. ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేయకుండా ఏపీ ప్రభుత్వం ఎస్సీ సోదరులను మోసం చేసిందని విమర్శించారు. విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వసూలు చేస్తూ ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేసిందన్నారు.
విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచడం వల్ల ఏపీకి పరిశ్రమలు రావడం లేదన్నారు. దీనివల్ల నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయాయని అన్నారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఐకమత్యంగా ఉండి రానున్న ఎన్నికల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణకు మారు పేరైన తెలుగుదేశం పార్టీలో నాయకులు, కార్యకర్తలు అందరూ రానున్న ఎన్నికల్లో ఓర్పుతో, నేర్పుతో భారీ మెజారిటీ దిశగా ముందడుగు వేయాలన్నారు.
బీజేపీ-తెలుగుదేశం-జనసేన పార్టీల కూటమి మైలవరం నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.