ఆంద్రప్రదేశ్
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల సమస్యలు పరిష్కరిస్తాం….
నారద వర్తమాన సమాచారం:పిడుగురాళ్ళ:ప్రతినిధ
బీసీ డిక్లరేషన్ ఒక చారిత్రాత్మక నిర్ణయం, పిడుగురాళ్ల పట్టణానికి చెందిన క్లస్టర్ 9,10 పరిధిలోని బీసీల ఆధ్వర్యంలో నిర్వహించిన “జయహో బీసీ” కార్యక్రమంలో బీసీ డిక్లరేషన్ కరపత్రాలు ఆవిష్కరించిన గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పిడుగురాళ్ల పట్టణానికి చెందిన క్లస్టర్ 9,10 పరిధిలోని బీసీల ఆధ్వర్యంలో పిడుగురాళ్ల పట్టణ బీసీ అధ్యక్షులు వల్లెపు రామకృష్ణ, క్లస్టర్ 9,10 ఇన్చార్జులు, బీసీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన “జయహో బీసీ” కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. ముందుగా యరపతినేని శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణా సంఘం సభ్యులు కీIIశే గుంటుపల్లి నాగేశ్వరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనానంతరం యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీలపై దాడులు,హత్యలు జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగాయన్నారు. గతంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 24 శాతం రిజర్వేషన్ తెచ్చారని,తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని 34 శాతానికి పెంచారని, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 34 శాతం రిజర్వేషన్ ఉన్న బీసీలకు 24 శాతం రిజర్వేషన్ తగ్గించడం వల్ల బీసీలకు రావాల్సినటువంటి నామినేట్ పదవులు ఎంపీటీసీలుగా, జడ్పిటీసీలుగా, సర్పంచ్లుగా కోతలు విధించారని దుయ్యబట్టారు. పేరుకే 56 కార్పొరేషన్ లు పెట్టామని చెప్పుకుంటున్న ఈ జగన్ ఏ కులానికి, ఎంత కార్పొరేషన్ నిధులు మంజూరు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బిజెపి పార్టీ బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.