జగనన్న రుణం తీర్చుకుంటా.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్య మంత్రి కావాలనే సంకల్పం తో.
నారద వర్తమానం సమాచారం :ఇబ్రహింపట్నం:ప్రతినిధి.
వాలంటీర్ లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అనే ఆదేశాలు నేపథ్యంలో వాలంటీర్ సంచలన నిర్ణయం.
వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సిద్ధమైన వాలంటీర్..
ముఖ్య మంత్రి జగన్ కోసం రాజీనామా చేసే యోచన లో ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం సచివాలయం ఈలప్రోలు గ్రామ వాలంటీర్.
వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ మళ్ళీ ముఖ్య మంత్రినీ చేసుకోవడం కోసం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పని చేయాలని నిర్ణయం.
వాలంటీర్ నిర్ణయం పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న తోటి వాలంటీర్ లు.
ఎన్టీ ఆర్ జిల్లా, మైలవరం:- రాష్ట్ర ముఖ్య మంత్రి గా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందించాలనే ఒక బలమైన లక్ష్యం తో వాలంటీర్ సంచలన నిర్ణయం తీసుకుబోతున్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని తుమ్మలపాలెం గ్రామ సచివాలయం ఈలాప్రోలు వాలంటీర్ గా పని చేస్తున్న కొర్లపాటి కిరణ్ సాయి దుర్గా తన వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేయాలనే యోచన లో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చిన నేపథ్యం లో వాలంటీర్ వ్యవస్థను ఎన్నికలకు దూరంగా ఉంచింది. ఎన్నికల విధుల్లో వాలంటీర్ లు ఉండకూడదని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తన వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రం లో నిరుపేద కుటుంబాలకు మంచి జరగాలంటే మళ్ళీ వైసీపీ అధికారం లోకి రావాలనీ కాంక్షిస్తూ రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. తన ఉద్యోగానికి రాజీనామా చేసి నిరంతర ప్రాయంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్రం లో వైసీపీ ప్రభుత్వ ఏర్పాటు లో తన వంతు కృషి చేయాలనే సంకల్పం తో రాజీనామ చేయనున్నట్లు తెలుస్తోంది . ఇదే విషయాన్ని మండల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తన రాజీనామా పత్రాన్ని అధికారులకు అందజేయనున్నట్లు సమాచారం. వాలంటీర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మైలవరం నియోజకవర్గం లో చర్చనీయాంశంగా మారనున్నది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.