కట్టావారిపాలెం గ్రామాభివృద్ధి నా బాధ్యత.
గ్రామానికి అండగా ఉంటా
ఈ ప్రభుత్వ హయాంలో రూ.15.63 కోట్ల సంక్షేమ అభివృద్ధి
నాయకులతో మంత్రి అంబటి రాంబాబు.
నారద వర్తమాన సమాచారం :సత్తెనపల్లి:ప్రతినిధి
కట్టావారిపాలెం అభివృద్ధి నా వ్యక్తిగతమైన బాధ్యతగా తీసుకొని ప్రతి విషయములోను మీకు అండగా ఉంటానని రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం వైయస్సార్ సిపి నియోజకవర్గ కార్యాలయంలో గ్రామ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రూరల్ మండల పార్టీ కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ ఈ ప్రభుత్వ హయాములో గ్రామంలో సంక్షేమం అభివృద్ధి కలిపి రూ. 15.63 కోట్ల నిధులు వెచ్చించామన్నారు. అభివృద్ధిని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ఇంత అభివృద్ధి గతంలో ఏ ప్రభుత్వము, ఏ పార్టీ చేయలేదని వివరించారు. రానున్న ఎన్నికలు ముఖ్యమైనవని, చాలా కీలకమని, పేదల తలరాతలు మార్చేవన్నారు . నియోజకవర్గంలోనూ పారదర్శకమైన పాలన చేశానని ,ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించానన్నారు. క్షేత్రస్థాయి నుండి ప్రతి కార్యకర్త , నాయకుడు, చిత్తశుద్ధితో ఎన్నికలు నిర్వహణలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ అవసరం వచ్చినా మీకు అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమంలో రూరల్ మండల నాయకులు, వైయస్సార్సీపి అనుబంధ విభాగాల బాధ్యులు తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.