పులిచింతల ప్రాజెక్టు మీద పోలీసుల అక్రమ వసూళ్లు
ఫార్మాలిటీ ఇవ్వాలంటూ నాలుగు చక్రాల వాహనాల దగ్గర 100 రూపాయల వసూళ్లు
నారదవర్తమానసమాచారం:మాదిపాడు:ప్రతినిధి
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజక వర్గం అచ్చంపేట మండల పరిధిలోని మాదిపాడు గ్రామం వద్దగల పులిచింతల ప్రాజెక్టు మీద పోలీసులు అక్రమంగా వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
గతంలో కూడా ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ పట్టించుకోని జిల్లా పోలీసు యంత్రాంగం.
అలానే రాత్రిళ్ళు ఎక్కువగా 500 నుండి 1000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని వాహనదారులుతెలియజేస్తున్నారు.
డబ్బులు కనుక ఒకవేళ ఇవ్వకపోతే నోటి దురుసు మాటలు కూడా మాట్లాడుతున్నారని వాహనదారులు తెలియజేశారు
అసలు ఈ అక్రమ వసూలు ఎవరు వసూలు చెయ్యమన్నారు అనేది తెలియాల్సి ఉంది.
మరో పక్క అడ్డగోలుగా ఎలాంటి అనుమతులు లేకుండా బల్లకట్టు నిర్వహిస్తూ వందల రూపాయలతో ప్రజల్ని పిడుస్తున్నారు…
ఇక క్రోసూరు సంతకు వచ్చే వాహనాలు విషయంలో నోటికి అంత వస్తే అంత అడుగుతున్నారని సమాచారం..
ఇలా మరోపక్క పోలీసులు అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తున్నారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.