నరద వర్తమాన సమాచారం :ప్రతినిధి
ఎన్నికల సంఘం రూపకల్పన చేసిన సి -విజిల్ యాప్ కు అనూహ్య స్పందన లభిస్తోంది.
సాధారణ ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం… ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 79 వేలకు పైగా ఉల్లంఘనలపై ప్రజలు ఫిర్యాదు చేశారని.. ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
ఇందులో 99 శాతం ఫిర్యాదులను పరిష్కరించామని, 89 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించినట్లు ఈ సి ఒక ప్రకటనలో తెలిపింది.
అక్రమ హోర్డింగ్లు, బ్యానర్లపై 58 వేల 500కు పైగా ఫిర్యాదులు అందగా… డబ్బు, బహుమతులు, మద్యం పంపిణీకి సంబంధించి 14 వందలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.