వైఎస్సార్సీపీలో చేరిన వేల్పూరు టీడీపీ నాయకుడు
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
నారద వర్తమాన సమాచారం:అచ్చంపేట:ప్రతినిధి
అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పొన్నగంటి వెంకటేశ్వరరావు తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు.ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని.. ఎవరికి ఏ అవసరమొచ్చినా.. తాను ఉన్నాననే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.