

నారద వర్తమాన సమాచారం:అచ్చంపేట:ప్రతినిధి
రెండోవ రోజు అచ్చంపేట ఎన్నికలప్రచారంలో లో నంబూరు వసంతకుమారి
అచ్చంపేట లో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సతీమణి నంబూరు వసంతకుమారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గ్రామంలో పర్యటించిన వసంతకుమారి కి స్థానికుల నుంచి ఆత్మీయస్వాగతం లభించింది. ఐదేళ్లలో అచ్చంపేటలో జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమంపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజలు నీరాజనాలు పలికారు. టీడీపీ పాలనలో చాలా ఇబ్బందులు పడ్డామని.. గత ఐదేళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. గ్రామంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇంటింటికీ వెళ్లిన నంబూరు వసంతకుమారి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. మరోసారి గెలిస్తే ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఏయే అభివృద్ధి పనులు చేస్తారో చెబుతూ.. ఓట్లు వేయాలని కోరారు. నంబూరు వసంతకుమారి మాట్లాడుతూ. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. గత ఐదేళ్లలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారని.. మరోసారి ప్రజలు ఆయనకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.