జై వసంత అనే నినాదంతో మార్మోగుతున్న మైలవరం.
తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహం.
బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో పెరిగిన బలం.
ఇబ్రహీంపట్నంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వసంతకు ఘనస్వాగతం.
నారద వర్తమాన సమాచారం ఇబ్రహీంపట్నం ప్రతినిధి.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తన విస్తృతమైన పర్యటనలతో ప్రజల్లో దూసుకెళ్తున్నారు. ఎండ వేడిమి కూడా లెక్కచేయకుండా ఆయన పర్యటన కొనసాగుతోంది. ముఖ్యంగా జై వసంత అనే నినాదంతో మైలవరం మార్మోగుతోంది. బిజెపి, జనసేన పార్టీల పొత్తుతో బలం మరింత పెరగగా తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తోంది.ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు స్వర్ణాదేవి, వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో మంగళవారం రాత్రి నిర్వహించిన బూత్ కమిటీ కన్వీనర్లు, మహాకూటమి నాయకుల శంఖారావం సమావేశంలో విజయవాడ పార్లమెంట్ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) మైలవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ తో పాటు, టీడీపీ రాష్ట్ర నాయకులు బొమ్మసాని సుబ్బారావు , మైలవరం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , మైలవరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జి నూతులపాటి బాల కోటేశ్వరరావు (బాల) , మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేపీ తో పాటు అక్కడ విచ్చేసిన ప్రముఖ నాయకులకు ఘన స్వాగతం లభించింది. ముందుగా మహానేత అన్న ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజాగళం కరపత్రాలను ఆవిష్కరించారు.వసంత రాక కోసం అక్కడికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎదురుచూశారు. అభిమాన నేత కనిపించగానే వారిలో సంతోషం మరింత వెళ్లి విరిసింది. బాటసంచా కాల్చుతూ, పూలు వెదజల్లుతూ పూలమాలలు వేసి శాలువాలు కప్పి అభినందిస్తూ కేపీని ఘనంగా స్వాగతించారు. తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన మైలవరం నియోజవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్తానని ఆయన ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు అదే విధంగా కేపీ శ్రమిస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.