నారద వర్తమాన సమాచారం:సతైనపల్లి:ప్రతినిధి
కట్టవారిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా.
వ్యక్తులు వెళ్లిపోయిన వైయస్సార్సీపీ వ్యవస్థను నమ్ముకుని ఉన్న మీకు మేము అండగా ఉంటాం.
రూ.1.60 కోట్లతో గ్రామాన్ని అభివృద్ధిచేశాం.
గ్రామస్తులతో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు
సత్తెనపల్లి
మీ గ్రామంలో మేము నమ్మిన వ్యక్తి మిమ్మల్ని, మమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయినా.. ఆయన వెంట వెళ్లకుండా గ్రామస్తులంతా వచ్చి నన్ను ఆశీర్వదించారు. మీ అందరికీ మంచి చేసేందుకు కట్టా వారి పాలెం గ్రామానికి దత్తత తీసుకుంటున్నానని రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు అంబటి రాంబాబు ప్రకటించారు. మంగళవారం సత్తెనపల్లి పట్టణము నుండి కట్టావారిపాలెం గ్రామం వరకు జరిగిన ద్విచక్ర వాహన ర్యాలీతో ఆయన పర్యటించారు. అనంతరం స్థానిక నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి అంబటి మాట్లాడుతూ గతంలో ఎక్కువసార్లు మీ ఊరు రాలేకపోయారని, భవిష్యత్తులో అలాంటి లోపాలు జరగకుండా తరచూ సందర్శిస్తానన్నారు. మీకు ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ సమస్యలు పరిష్కరించి , మీకు అందుబాటులో ఉంటానన్నారు. 12 వందల ఓట్లు ఉన్న చిన్న గ్రామంలో గత నాలుగున్నరలో రూ.1.60 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. గడపగడప కు మన ప్రభుత్వ నిధులు రూ. 20 లక్షల కూడా ఒక సచివాలయం పరిధిలో రెండు గ్రామాలు ఉంటే ఈ ఒక్క గ్రామానికి కేటాయించామని వివరించారు. వైయస్సార్సీపీ పేదల పక్షాన నిలిచే పార్టీ అని, ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించిందన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైయస్ఆర్ సిపి ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఆయనతోపాటు గుంటూరు ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, రూరల్ మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సిపి అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.