ఘనంగా సరస్వతి విద్యా మందిర్ 40వ వార్షికోత్సవం
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ 40వ వార్షికోత్సవాన్ని ఆదివారం పురపాల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఎంఈఓ గుర్రం వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ నోముల గణేష్, ప్రైవేటు పాఠశాలల మండల పరిరక్షణ సమితి అధ్యక్షులు బండి యాదగిరి, గంజి బసవలింగం, కుడికాల దశరథ, ట్రస్మా జిల్లా అధ్యక్షులు పగడాల జలంధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా కోశాధికారి నోముల బసవ రెడ్డి, పట్నం కృష్ణకుమార్, వనం వెంకటేశం, మండల అధ్యక్షులు వంగూరి పాండు, ప్రధాన కార్యదర్శి భాస్కరాచారి, కోశాధికారి ఎడ్ల తిరుమల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం, క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ దేశభక్తి భావాలను పెంపొందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల దినదినాభివృద్ధి చెందాలని మంచి భవిష్యత్తు కలిగిన విద్యార్థులు తయారు కావాలని ఆకాంక్షించారు. పాఠశాల చైర్మన్ సింగన బోయిన సత్యనారాయణ, ప్రిన్సిపాల్ నామిని భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ దేశభక్తి పెంపొందిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించేలా క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతిభ కనబరిస్తున్నారని, ఇక్కడ అభ్యసించిన విద్యార్థులు దేశ విదేశాలలో వివిధ రంగాలలో స్థిరపడి దేశ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారన్నారు. పాఠశాలలో గతంలో పనిచేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అతిధులకు ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురుని ఆకర్షించాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం కటికిరెడ్డి దామోదర్ రెడ్డి , దేవరకొండ దయాకర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.