![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/04/img-20240403-wa23712525602568426549227-1024x680.jpg?resize=696%2C462&ssl=1)
![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/04/img-20240403-wa23837830209767724697342-1024x680.jpg?resize=696%2C462&ssl=1)
నారద వర్తమాన సమాచారం:సతైనపల్లి:ప్రతినిధి
వైయస్సార్ సిపి ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు.
12 వేల మంది కి పైగా పాల్గొన్న ముస్లిం సోదరులు
ప్రత్యేక ప్రార్థనలు, ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి అంబటి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్
సత్తెనపల్లి
సత్తెనపల్లి పట్టణంలోని సువిశాలమైన ఈద్గా ప్రాంతం ముస్లిం సోదరులతో నిండిపోయింది. రంజాన్ పండుగ ముందే వచ్చినట్లుగా 12 వేల మందికి పైగా నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లిం సోదరులు వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
కార్యక్రమంలో ముందుగా రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు అంబటి రాంబాబు, నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నియోజవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి లు పాల్గొన్నారు . ముస్లిం మత పెద్దలతో కలిసి నమాజులో పాల్గొన్నారు .రానున్న ఏడాది అంతా రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వాన్ని అల్లా దీవించాలని వారు ప్రార్థించారు. ఒకరినొకరు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఉపవాసం ముగించిన ముస్లిం సోదరులందరికీ ప్రత్యేక పౌష్టికాహారాన్ని మంత్రి అంబటి, అనిల్ యాదవ్ స్వయంగా వడ్డించి , ఆప్యాయంగా పలకరించారు.
కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సిపి అనుబంధ సంఘాల బాధ్యులు, ముస్లిం సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.