నారద వర్తమాన సమాచారం
వన్యప్రాణులు మానవ హితులు
అటవీ జంతువులను కాపాడుకోవడం మన బాధ్యత : జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
వన్య ప్రాణులు మానవ హితులని, వాటిని సరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. సహజంగా పాములు, పులుల వంటి జీవరాశులు అంటే ప్రజల్లో భయం ఉంటుందని, భయంతో వాటిని వేటాడటం, చంపడం జరుగుతుందన్నారు. అయితే వాస్తవానికి వన్యప్రాణులు కేవలం భయంతో మాత్రమే మనుషుల మీద దాడి చేస్తాయన్నారు. పర్యావరణంలో వివిధ రకాల ఆహార చక్రాలలో వన్యప్రాణులు భాగస్వాములై పర్యావరణానికి, మానవాళికి మంచి చేస్తాయన్నారు. విష సర్పాలు సైతం ఎలుకలు, ఇతర కీటకాల వృద్ధిని నివారించి రైతులకు మెరుగైన పంట దిగుబడి రావడంలో సహకరిస్తాయన్నారు. రైతులు ప్రమాదకర సర్పాలు, విషం లేని సర్పాల గురించి అవగాహన పెంచుకోవాలన్నారు.
ప్రపంచ పాముల దినోత్సవం(జులై 16), అంతర్జాతీయ పులుల దినోత్సవం (జులై 29) నేపథ్యంలో బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని జాషువా సమావేశ మందిరంలో వన్యమృగ సంరక్షణ వర్క్ షాప్ నిర్వహించారు. వర్క్ షాపులో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, ఎస్పీ శ్రీనివాస రావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు.
వర్క్ షాప్ లో నిజమైన సర్పాలతో ఏర్పాటు చేసిన లైవ్ షో వీక్షకులను ఆకట్టుకుంది. విష సర్పాలు, విషం లేని సర్పాల గురించి వర్క్ షాప్ నిర్వాహకులు అవగాహన కల్పించారు.
వన్యప్రాణుల సంరక్షణ, ప్రజల్లో అపోహలు, అనవసర భయాలు, మూఢ నమ్మకాల గురించి ఎమ్మెల్యే చదలవాడ ఉత్సాహంగా ప్రశ్నలు అడిగారు. వన్యప్రాణుల ప్రవర్తన, వాటి సంరక్షణ గురించి వర్క్ షాప్ నిర్వహించిన అటవీ శాఖ అధికారులను అభినందించారు. పాము కాటుకు విరుగుడు మందు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచామన్నారు.
జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో పులి అవశ్యకత గురించి తెలియజేస్తూ ‘ పులిని ఎందుకు సంరక్షించాలి?’ అనే పోస్టర్ ను విడుదల చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.