నారద వర్తమాన సమాచారం:రాజుపాలెం:ప్రతినిధి
అలసిన సమయంలో
అంబటి టీ.. అద్భుతం బాస్
రెడ్డిగూడెంలో టీ పాయింట్లో మంత్రి అంబటి
రాజుపాలెం
అలసిన సమయంలో మంచి ఛాయ్ హుషారునిస్తుంది. అదే అల్లం, ఇలాచి కలిపి స్వయంగా మంత్రి అంబటి చేతుల మీదుగా వేడివేడిగా తాగితే అబ్బో..ఆ టీ చాలా హాట్ గురూ, సంథింగ్ స్పెషల్ బాసూ అంటున్నారు వైయస్సార్సీపీ నాయకులు. గురువారం రాజుపాలెం మండల ఎన్నికల పర్యటనలో భాగంగా రెడ్డిగూడెంలో ఆయన ప్రధాన రహదారి లో లిమ్రా బేకరీ లో ఉన్న భాషా టీ స్టాల్ ను సందర్శించారు. ఆయన వెంట ఉన్న నాయకులు టీ తాగుదాం సార్ అనగానే కొంచెం ఆలోచించి.. అంబటే లేచి స్టవ్ వద్దకు వెళ్లి నేతలను ఆశ్చర్యానికి గురి చేశారు. వారి తేరుకునే లోగా అల్లం, యాలకులు నూరి, వేడివేడిగా రుచి, శుచి, సువాసనతో కూడిన ఛాయ్ ని ఆయన అందించారు. అద్భుతమైన అంబ”టి”..తాగి పరవశానికి లోనయ్యారు నాయకులు. టీ కొట్టుతో జీవనం సాగిస్తున్న భాషాను అంబటి అభినందించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీసి బాషా సమాధానం తో సంతృప్తి చెందారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.