Monday, December 2, 2024

దళిత ద్రోహులకు ఆశ్రయం ఇస్తున్న వ్యక్తి జగన్ రెడ్డి

నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి

దళిత ద్రోహులకు ఆశ్రయం ఇస్తున్న వ్యక్తి జగన్ రెడ్డి

  1. వైఎస్ఆర్సీపీ దళిత ద్రోహుల పార్టీ అని మరోసారి రుజువు అయ్యింది.
  2. ⁠జగన్ మోహన్ రెడ్డి దళితులను అవమానించిన వారికి ఆశ్రయం ఇస్తున్నారు.
  3. మండపేట నుంచి తోట త్రిమూర్తులు అనే వ్యక్తికి ఆశ్రయం ఇచ్చింది. ప్రస్తుతం ఆయన్ను కోర్టు దోషిగా తేల్చింది.
  4. దళిత వ్యతిరేక నాయకులకు జగన్ పార్టీ బహిరంగంగా ఆశ్రయం కల్పిస్తుంది.
  5. 1996లో జరిగిన “శిరోముండనం” కేసులో విశాఖపట్నం కోర్టు వెలువరించిన తీర్పులో వై యస్ ఆర్ సి పి  నాయకులు తోట త్రిమూర్తులకు శిక్ష విధించింది.
  6. ‘నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ ప్రతి వేదికపై ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారు.
  7. నాడు దళితుడిని చంపిన అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లే చేసి మళ్లీ పార్టీలోకి తెచ్చుకున్నాడు.
  8. జగన్ రెడ్డి నడుపుతున్న ప్రభుత్వంలోనే దళితులపై దాడులు ఎక్కువ అయ్యాయి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీలకు రక్షణ లేకుండా పోయింది.
  9. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలయ్యారు.
  10. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను కొందరు శాడిస్టులు నిర్బంధించి, నాలుగుగంటలపాటు చిత్రహింసలు పెట్టారు.
  11. దాహంవేసి మంచినీళ్లు అడిగితే సభ్యసమాజం తలదించుకునేలా మూత్రంపోసి అవమానించారు.
  12. ముఖ్యమంత్రి జగన్ కు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
  13. బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో నేనే బాధితుడ్ని అని వాపోయారు.
  14. జగన్ జమానాలో దళితులపై అణచివేత, దుశ్చర్యలకు ఇంతకు మించిన పరాకాష్ట మరోకటి ఉండదు.
  15. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,035 మంది దళితులపై దాడులు జరిగాయి.
  16. ఎన్ సీఆర్ బీ నివేదిక ప్రకారం దళితులపై దాడులు జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ 7 వ స్థానంలో ఉంది.
  17. 2021లో మొత్తం 208 మంది ఎస్సీ మహిళలు, చిన్నారులపై దాడులు జరగ్గా, 33 మంది దళితులు హత్యకు గురయ్యారు.
  18. అస్పృశ్యత పేరుతో నంద్యాల జిల్లా మునగాల గ్రామంలోని సుంకులమ్మ ఆలయంలోకి వెళ్లకుండా అవమానించి, అడ్డుకున్నారని మల్లెపోగు నరహరి అనే దళిత (మాదిగ) యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌ జంబులయ్య, మరికొందరు నరహరిని కాలితో తన్ని ఆలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే తీవ్రపరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చారించారు.
  19. పొలంలో పనిచేస్తున్న దళిత అంగన్‌వాడీ కార్యకర్తపై కొత్తపల్లి ఎస్‌ఐ ముబీనతాజ్‌ దుర్భాషలాడారు. ఆమెను శారీరకంగా, మాటలతో వేధించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. కొత్తపల్లి ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ర్యాలీ చేపట్టినా ప్రయోజనం లేకపోయింది.
  20. 2020లో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 39 మంది చిన్నారులు సహా మొత్తం 111 మంది ఎస్సీ మహిళలు వేధింపులకు గురయ్యారు
  21. దళితులపై ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో రోజుకో దాడి జరుగుతుంది.
  22. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే వారిపై అన్యాయంగా దాడి చేస్తున్నారు. శిరోముండనాలు, హత్యలు, వేధింపులు, దమనకాండలకు పాల్పడుతున్నారు.
  23. కరోనా సమయంలో కేవలం ఒక్క మాస్కు అడిగినందుకు వైజాగ్ లో డా. సుధాకర్ ను వేధించి చంపారు.
  24. మద్యం రేట్లు పెంపుపై ప్రశ్నించినందుకు చిత్తూరు జిల్లాలో దళిత యువకుడు ఓ ప్రకాశ్ ను చంపారు.
  25. అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నించినందుకు తూర్పు గోదావరిలో వర ప్రసాద్ అనే యువకుడికి గుండుకొట్టించారు.
  26. మాస్క్ పెట్టుకోలేదని ప్రకాశం జిల్లా థామస్ పేటకు చెందిన కిరణ్ ను పోలీసులు కొట్టిచంపారు.
  27. చిత్తూరు జిల్లాలో మేజిస్ట్రేట్ రామకృష్ణ, అతని సోదరుడు రామచంద్రపై దాడి చేశారు.
  28. దళిత మహిళా డాక్టర్ అనితా రాణి బాత్రూంలో ఉండగా వీడియోలు తీసి బెదిరించారు.
  29. కచ్చులూరు బోటు ప్రమాదంపై ప్రశ్నించినందుకు మాజీ ఎంపీ హర్ష కుమార్ పై అక్రమ కేసులు బానాయించారు.
  30. దళితులు అసైన్డ్ భూములు ఆక్రమణపై ప్రశ్నించిన మహాసేన రాజేశ్ పై అక్రమ కేసులు పెట్టారు.
  31. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడు సూరిబాబు అనుచరుడు దళిత యువకుడిని అర్ధనగ్నంగా చేసి చెట్టుకు కట్టేసి చెప్పుతో కొట్టాడు.
  32. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం వులవపాళ్ల గ్రామంలో పెట్రోల్ బంక్ వద్ద దళిత కార్మికుడిని వైఎస్ఆర్సీ నేత మహేష్ నాయుడు చెప్పుతో కొట్టి దుర్భాషలాడారు.
  33. దళితుల భూములకు రక్షణ లేకుండా పోయిందని, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ఎకరాల దళితుల భూములను లాక్కున్నారు.
  34. ఇలా దళితులను ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్ రెడ్డి ఘనతను అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన 2020 హ్యూమన్ రైట్స్ ప్రాక్టిస్ ఇన్ ఇండియా కూడా గుర్తించి తన రిపోర్టులు దళితుల అట్రాసిటీలను పేర్కొంది.
  35. స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వశాఖ పేర్కొన్న దాని ప్రకారం (ఏప్రిల్- జూన్ 2022) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దళితుల కోసం కనీసం ఒక్క ఎకరా కూడా పంపిణీ చేయలేదు.
  36. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంపై వైసీపీ ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. దీంతో 6 మంది విద్యార్థులు మాత్రమే దీనికి అర్హత పొందారు. అదే తెలుగుదేశం హయాంలో అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 19 మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందించారు.
  37. కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఎఫ్‌ఎస్‌డిసి పథకం కింద ఉపాధి కల్పనకు ఎస్సీ లబ్ధిదారులకు సుమారు రూ. 3 లక్షల వరకు ఇస్తోంది. కానీ వైఎస్సార్‌సీపీ మాత్రం ఈ పథకాన్ని అమలు చేయడం లేదు.
  38. కేజీబీవీ మోడల్ స్కూళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ కాలేజీల్లో విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. నాలుగేళ్లుగా ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు సరఫరా చేయడం లేదు.

Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading