
లైంగిక వేధింపుల బాధితులకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:ఏప్రిల్ 20,
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా జడ్జి మరియు చైర్ పర్సన్ ఎస్.ఎన్. శ్రీదేవి చేతుల మీదుగా లైంగికంగా వేధింపబడ్డ బాలికలకు నష్ట పరిహారం కింద 3,00,000 మరియు 2,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చెక్కులను బాధితులకు పంపిణీ చేయడం జరిగింది. వివరాలకు వెళితే సుప్రీం కోర్ట్ ఆదేశాను సారం సెక్షన్ 357ఏ బాధితుల పరిహారం కింద పిల్లలపై లైంగిక వేధింపులు పోక్సో చట్టం కింద నమోదైన కేసులకు ఈ పరిహారం కింద నష్ట పరిహారాన్ని జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారం బాధితులకి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జి లాల్ సింగ్ నాయక్ , సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి టి. నాగరాణి పాల్గొన్నారు.









