నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం
మాదిగల చిరకాల ఆకాంక్ష యస్సి వర్గీకరణ చంద్రబాబు తోనే సాధ్యం
వైసీపీ రద్దు చేసిన 27 సంక్షేమ పథకాలు తిరిగి మరలా ప్రవేశపెడతాం
వైసీపీని ఓడిద్దాం అమరావతిని నిర్మిద్దాం
మాదిగల జెండా ఎజెండా ఒకటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడమే
మాదిగల పంతం ఒక్కటే జగన్ అంతం
సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజా వేదిక నందు నియోజకవర్గస్థాయి మాదిగల ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కన్నా
మాదిగల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాల రావు మరియు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్
ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి. మాజీ మంత్రి వర్యులు సత్తెనపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ.గత ఐదు ఏళ్లుగా చూస్తున్నాం.జగన్ పాలనలో దళితులకు ఒరిగింది ఏమీ లేదు. నా ఎస్సీ లు నా ఎస్టీలు అని అందరినీ మోసం చేసిన ఘనత అది ఒక్క జగన్ కే చెందుతుంది.దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్ రెడ్డి పాలన లో దళిత బహుజనులకు తీరని ద్రోహం. సంక్షేమ పథకాలు పొందటం ప్రజల హక్కు జగన్ వేసే బిక్ష కాదు. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును విదేశీ విద్యకి తొలగించి నీ పేరు పెట్టుకుంటావా జగన్. 27 పథకాలు రద్దుచేసి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు నవరత్నాలకు మళ్లించిన జగన్ రెడ్డికి ఓటు అడిగే హక్కు కూడా లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ రెడ్డి పాలనకి స్వస్తిపలికి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుని సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందాం అభివృద్ధిని సాధించుకుందాం తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు కి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తోటి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ. దళితులను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమే. ఏ దళిత కాలనీలో పథకం అమలు కావడం లేదు ఐదేళ్లలో 38 కోట్ల సప్లై నిధులు దారి మళ్లింపు చేశారు. రాజధానితో వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయారు.ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయకుండా కమ్యూనిటీని అభివృద్ధి చేయడానికి వాడతామని. విదేశీ విద్యకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని. కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తాం. దళితుల అభ్యున్నతి కోసం తెలుగుదేశం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఉన్న అన్ని పథకాలు అమలు చేస్తామని అభివృద్ధిలోకి తీసుకొస్తాం అని తెలియజేశారు. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడుగా నన్ను సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా కన్నా లక్ష్మీనారాయణ ని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీ తోటి గెలిపించాలని అభ్యర్థించారు
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ దళిత నాయకులు జనసేన నాయకులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.