Thursday, May 21, 2026
spot_img

సరస్వతీ అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు.. సీఎం రేవంత్ రెడ్డి

నారద వర్తమాన సమాచారం

సరస్వతీ అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు.. సీఎం రేవంత్ రెడ్డి

భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మే 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు తరలి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేయాలని చెప్పారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున భక్తులు ఆరోగ్యం కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జరగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ పుష్కర శుభాకాంక్షలు తెలిపారు.

భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు

పుష్కర ప్రాంతంలో భద్రత కోసం 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 100 మంది గజ ఈతగాళ్లను నియమించడంతో పాటు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, సేఫ్టీ బోట్లను మోహరించారు.

ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రత్యేక హారతి, తెప్పోత్సవాలకు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అదనంగా రూ.1.20 కోట్లతో ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయగా, నాగేంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు. మీడియా సెంటర్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది..


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version