డాక్టర్ గీరెడ్డి రవీందర్ రెడ్డి నూతన గృహ ప్రవేశానికి హాజరైన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ,ప్రముఖులు
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:ఏప్రిల్ 21,
కామారెడ్డి ప్రముఖ వైద్యులు న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ గిరెడ్డి రవీందర్ రెడ్డి అనూష నూతన గృహప్రవేశం మరియు నూతన ఆసుపత్రి ప్రారంభానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ హెచ్ఓడి న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మోహన్ దాస్ ఆదివారం నాడు ప్రారంభించారు.ఆసుపత్రి ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ జహీరాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్లరాజు గూడెం శ్రీనివాసరెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి తోపాటు కామారెడ్డి పట్టణానికి చెందిన పలు ఆసుపత్రులకు చెందిన డాక్టర్లు హాజరై గిరెడ్డి రవీందర్ రెడ్డి అనూషాలను ఆశీర్వదించారు.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీని సురేష్ కుమార్ లను వైద్యులు గిరెడ్డి రవీందర్ రెడ్డి అనూష లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు షబ్బీర్ అలీ సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.