ఘనంగా బక్రీద్ పండుగ
త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ..
బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ..
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి:జూన్ 17,
కామారెడ్డి పట్టణంలోని కోర్ట్ ఆవరణలో గల ఈద్గాలో బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్ చేసి అందరికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ..
త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ త్యాగాల ద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమస్త జనులకు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని బక్రీద్ పండుగ విశ్వమానవాళికి అందిస్తున్నదని తెలిపారు.
బక్రీద్ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని అన్నారు.
సకల మతవిశ్వాసాలను, సంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్రంలో దేశంలో పాలన కొనసాగాలని పేర్కొన్నారు.
అన్నివర్గాల ప్రజలు శాంతియుతంగా కలిసిమెలసి జీవించేలా, గంగా జమునా తహజీబ్‌ను కాపాడుకుంటూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అల్లాతో ప్రార్థించానని అన్నారు.
తెలంగాణ ఆధ్యాత్మిక పరంపరను కొనసాగాలని అల్లా దయ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.