తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టి పి యు యస్ )
ఉపాధ్యాయు లకు టెట్ మినహాయింపు తో కూడిన ప్రమోషన్ల కు అనుమతి ఇవ్వాలి.
టి ఈ టి పై యన్ సి టి ఈ చైర్ పర్సన్ తో చర్చించిన తపస్
నారద వర్తమాన సమాచారం కామరెడ్డి జిల్లా ప్రతినిధి:ఏప్రిల్ 21,
ఎన్ సి టి ఈ చైర్ పర్సన్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ ని, ఎన్ సి టి ఈ అండర్ సెక్రెటరీ మరియు ఎన్ సి టి ఈ అఫీషియల్స్ ను కల్సి తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఉపాధ్యాయుల పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న టి ఈ టి కు మినహాయింపు ను కోరడమైనది.. వారితో చర్చించిన కీలక అంశాలపై వివరణలు
- యన్ సి టి ఈ నిబంధనల ప్రకారం లెవల్ అనగా కేడర్ మార్పు కాదు. ప్రైమరి నుండి హైస్కూల్, కు మారడమే లెవెల్. SA, నుండి జీ హెచ్ యమ్ ప్రమోషన్ హైస్కూల్ స్థాయి లెవెల్ లోబడి ఉన్నందున లెవెల్ మార్పుగా పరిగణించబడదు.
(ఏ.)6,7,8 తరగతులు భోదిస్తున్న యల్ పి లకు కూడా లెవెల్ మార్పు లేదు. కావున వారికి కూడా టి ఈ టి అవసరం లేదు.
(బి )పి యస్ లలో భోదిస్తున్న యల్ యఫ్ యల్ లకు ప్రమోషన్ పొందాలంటే టి ఈ టి అవసరం లేదు
(సి )పి యస్ (1-5తరగతుల )నుండి హైస్కూల్ కు యస్ ఎ ప్రమోషన్స్ కు వెళ్లానుకునే యస్ జి టి లక మాత్రం పేపర్ 2 టి ఈ టి అవసరం.
(బి )ఇన్ సర్వీస్ లో ఉన్న యస్ జి టి ఉపాధ్యాయులు యస్ ఎ ప్రమోషన్ కోసం టి ఇ టి రాయాలి అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వమే అర్హత పాస్ పర్సెంటెజ్ కుదించవచ్చు.
ప్రత్యేకంగా టి ఈ టి ను నిర్వహించవచ్చు.
సబ్జెక్ట్ బట్టి సిలబస్ ను నిర్ణహించుకోవచ్చు
ఈ విషయాలపై యన్ సి టి ఈ నిబంధనలకు సడలింపు ఇచ్చుకునే సౌలభ్యం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని యన్ సి టి ఈ అధికారులు తెలియజేశారు.
యన్ సి టి ఈ అధికారులను ఢిల్లీలో కల్సిన వారిలో తపస్ రాష్ట్ర అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్, మరియు రాష్ట్ర బృందానికి టి పి యు యస్ కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన జిల్లా అధ్యక్షులు పుల్గం రాఘవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భూనేకర్ సంతోష్ ,లు రాష్ట్ర శాఖ కు అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేసారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.