నారద వర్తమాన సమాచారం
“ఫ్యాన్”కి ఓటువేస్తే ఐదేళ్లు చల్లని సంక్షేమ పాలన…
చంద్రబాబు అంటనే కరువు…
జగన్ అంటే సంక్షేమ పాలన… చంద్రబాబు అంటే కరువు పాలన అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు.
వినుకొండ నియోజకవర్గం రూరల్ మండలంలోని అందుగులకొత్తపాలెం,
నీలగంగవరం, కోప్పుకొండ, నడిగడ్డ,దొండపాడు,భారతపురం, తిమ్మాయిపాలెం,ఉప్పెరపాలెం గ్రామాల్లో శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి అనీల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహింంచారు.
ఈ సందర్భంగా జనం నీరాజనం పట్టారు..
జై అనిల్ అన్న జై బొల్లా అంటూ నినాదాలతో హోరెత్తించారు..
బాణాసంచా కాలుస్తూ, గజ మాలలు వేసి ఘన స్వాగతం పలికారు…
ప్రచారంలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే జగనన్న పాలన వస్తుందని అమ్మ ఒడి, చేయూత, రైతు భరోసా చేదోడు, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు జరుగుతాయని, ఇంటి వద్దకే పింఛన్ తీసుకొచ్చి వాలంటీర్లు ఇస్తారని తెలిపారు. చల్లని సంక్షేమ పాలన అందించే జగన్మోహన్ రెడ్డిని దీవించాలని విజ్ఞప్తి చేశారు..
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మాయమాటలు, మోసాలు తోపాటు కరువు తాండవిస్తుందని ప్రజలు కష్టాలు ను కొని తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు…
పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన అందరికీ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని తెలిపారు. 14 ఏళ్ళు పరిపాలించి ఒక మంచి పని కూడా చేయని సైకిల్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. పల్నాడు ప్రాంత ప్రజల పై ఉన్న నమ్మకంతో తనను నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా జగనన్న బరిలో దించాడని ప్రజలంతా ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పల్నాడు ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని.. అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు.
బీసీలకు సీటు ఇస్తానంటే లావు శ్రీకృష్ణదేవరాయలు వేరే పార్టీ చూసుకున్నారని… నెల్లూరు చెందిన తనను సీటు మారుస్తానంటే మారు మాట్లాడకుండా పల్నాటికి వచ్చానని నాయకుడి పట్ల పార్టీ పట్ల విధేయత కల నాకు మద్దతిస్తే పల్నాడు ప్రజలకు సేవ చేసుకుంటానని చెప్పారు…
చంద్రబాబు అంటే గుండు సున్నా…
చంద్రబాబు నాయుడు అంటే సూపర్ సిక్స్, సూపర్ ఎయిట్ కాదని పెద్ద గుండు సున్నా అని వారు విమర్శించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంకు గా మాత్రమే చూశారని ధ్వజమెత్తారు. భారత దేశ చరిత్రలో నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ నినాదాన్ని తీసుకొని తన విధానమని చాటి చెప్పిన ఏకైక నాయకుడు సీఎం జగన్ మెహన్ రెడ్డి ని తెలిపారు.
ప్రతి గ్రామంలో అభివృద్ధి
వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు
ఎంపీగా ఓటేసి గెలిపిస్తే ఒక్క రూపాయి కూడా కూడా ఎంపీ నిధులు ఖర్చు చేయకుండా ఎంపీని చేస్తే, నమ్ముకున్న వారిని మోసం చేశారని లావు కృష్ణదేవరాయలపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజమెత్తారు..
వినుకొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఎంతో అభివృద్ధి జరిగిందని, ప్రజలకు ఎంతగానో మేలు జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న లంబు జంబు మాయమాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. చేపల చేరువులను దోచుకునేది ఒకరు అయితే, పది సంవత్సరాలు అభివృద్ధి చేయటం చేతకాని దద్దమ్మ మరొకరు అని విమర్శించారు. ప్యాకేజీ కోసం పార్టీ మారే నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బిసి ల సంక్షేమం కోరే పార్టీ ని ప్రజలు ఆదరించాలని, ఆ లంబు జెంబులకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రోజోకో పార్టీ మారుస్తూ, రోజుకో మాట మార్చే నాయకులను ప్రజలు గమనించాలని తెలిపారు. అభివృద్ధికి పట్టం కట్టి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ ని ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.