Friday, November 22, 2024

ఒంగోలు ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటు చేసుకోవడంతో గందరగోళంకు దారితీస్తుంది.

నారద వర్తమాన సమాచారం

గందరగోళం వైపుగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్…

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటు చేసుకోవడంతో గందరగోళంకు దారితీస్తుంది.

ఒంగోలుకు తొలుత బీఆర్ గౌస్ పేరు ప్రకటించగా ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టారు. మూడో జాబితాలో ఒంగోలు అభ్యర్థిగా కొత్తపట్నం మండలానికి చెందిన దాసరి నాగలక్ష్మి ఖరారయింది. కొండపి సీటు తొలుత శ్రీపతి సతీష్ కు ఇచ్చి ఇప్పుడు పసుమర్తి సుధాకర్ కు కేటాయించారు. కనిగిరి సీటు కదిరి భవానికి కేటాయించగా ఇప్పుడు సుబ్బారెడ్డిను, మార్కాపురం అభ్యర్థిగా షేక్ సైదాను ప్రకటించగా ఆయన ఇండియా కూటమి నాయకులతో బీ ఫారంపై నామినేషన్ కూడా వేశారు. ఇప్పుడు మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థిగా సయ్యద్ జావీద్ అన్వర్ ను ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో రాష్ట్ర నాయకత్వం పార్టీ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వారిని కాదని మళ్లీ కొత్త అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీలో ముసలం పుట్టడం ఖాయంగా కనపడుతుంది. పార్టీ నాయకత్వం దూరదృష్టి లోపంతో ఆ నియోజకవర్గాల్లో ఒకరికి ఒకరు మద్దతు చేయలేని పరిస్థితి ఏర్పడింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version