నారద వర్తమాన సమాచారం
నేను పక్కా లోకల్…నాన్ లోకల్ అభ్యర్థులను నమ్మోద్దు.
రెండో సెట్ వేసిన జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,పార్టీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్
కోటు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి
అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ స్థానిక అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిస్తేనే సాధ్యమవుతుందని నేను పక్కా లోకల్..నాన్ లోకల్ వారిని నమ్మి మరోసారి మోసపోవద్దని జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పార్టీ తరుపున సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండో సెట్ నామినేషన్ వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వావిలాల గోపాలకృష్ణయ్య, యర్రం వెంకటేశ్వర రెడ్డి, కోడెల శివప్రసాద రావులు స్థానికులు కాబట్టే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చేప్పారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి స్థానికేతరులు పక్కా జిల్లాల నుంచి సత్తెనపల్లికి వలస వచ్చి పోటీ చేస్తున్నారని తెలిపారు. వారు పదవిని అనుభవవించటం, సంపాదించుకోవటమే తప్పా ప్రజలకు మౌలిక వసతుల కల్పన, ఉపాధి, అభివృద్ధి తదితర విషయాలు పట్టవని పేర్కొన్నారు. నేను స్థానికున్ని గతంలో స్థానికులు ఎమ్మెల్యేలుగా గెలిచి ఎలాగైతే ఇక్కడ అభివృద్ధి చేశారో నేను కూడా అలాగే అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఐదు రూపాయల జామకాయను కొనుక్కునే సమయంలో ఎలాగైతే బండంతా ఏరి తీసుకుంటామో ఓటు వేసేటప్పుడు అభ్యర్థి గుణగణాలు తదితర అంశాలు దృష్టిలో ఉంచుకుని ఓటు వేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. స్థానికుడు…యువకుడు.. విద్యావంతుడైన జొన్నలగడ్డ విజయ్ కుమార్ అనే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని కోటు గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించాడు. ఆయన వెంట గడ్డం సైదారావు, మహంకాళి వెంకట్రావు, బొక్క భాస్కరరావు, దాసరి వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాది మర్రి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.