నారద వర్తమాన సమాచారం
100 కేసుల తెలంగాణ మద్యాన్ని పట్టుకున్న జగ్గయ్యపేట స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ మణికంఠ రెడ్డి కు
అభినందనలు తెలియజేసిన అసిస్టెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ సూపరింటెండెంట్ సి భార్గవ్
జగ్గయ్యపేట పట్టణం
స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ కార్యాలయం నందు అసిస్టెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ సూపరింటెండెంట్ మైలవరం సి భార్గవ్ తో ప్రెస్ మీట్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు తెల్లవారు జామున సుమారు 5 గంటల సమయంలో తెలంగాణ నుండి తక్కెళ్ళపాడు రోడ్డులో అపీ ఆటో ను పట్టుకుని వంద కేసులు సుమారు 6 లక్షల 50 వేల రూపాయల విలువ గల తెలంగాణ మద్యాన్ని తరలిస్తుండగా సెబ్ సిఐ మణికంఠ రెడ్డి మరియు వారి సిబ్బంది కల్సి వాటిని పట్టుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు.
వెంటనే అపీ ఆటోని అదులోకి తీసుకొని ఆటో డ్రైవర్ ని విచారించగా తెలంగాణ నుండి ఇబ్రహీంపట్నం వరకు కిరాయికి ఎవ్వరో చెప్పితే తీసుకెళ్ళు తున్నట్లు డ్రైవర్ చెప్పాడని అన్నారు. పూర్తి విచారణ చేపట్టి దీని వెనుక ఎవ్వరున్నారో వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఇప్పటికే యన్.టి.ఆర్ జిల్లా వ్యాప్తంగా సెబ్ పట్టుకున్న అక్రమ మద్యం తరలింపు కేసులలో జగ్గయ్యపేట సెబ్ సిఐ మణికంఠ రెడ్డి వారి సిబ్బంది పట్టుకున్న కేసులే ముందు పీఠాన్న నిలబడుతుందని,వీరి మెరుగైన మంచి పనితీరు కనబరచినందుకుగాను వారికి, వారి సిబ్బందికి ప్రభుత్వం తరుపున రివార్డులు ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు ఆయన అన్నారు.
ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి జగ్గయ్యపేట స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో సిఐ మణికంఠ రెడ్డి వారి సిబ్బంది కలసి సుమారు 85లక్షల 24 వేల విలువ గల రెండు వేల యాభై ఒక్క లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు.
ఇప్పటికే 76 కేసులను నమోదు చేసి,తొంబై మూడు మందిని అరెస్టు చేయడంతో పాటు, పదిహేను వాహనాలను సైతం సీజ్ చేయడం జరిగింది. దీనితో పాటు రెండు వందల యాభై మంది పై మండల తహసీల్దార్ వారి సమక్షంలో బైండోవర్ లను, పదకొండు మంది మీద హిస్టరీ షీట్ ని ఓపెన్ చేయడం జరిగిందని అన్నారు.
దొడ్డి దారిన అక్రమ మద్యం, గంజాయి లాంటి వాటిని తరలించిన,నిల్వ ఉంచిన, అమ్ముతున్న సమాచారాన్ని పౌరులు ఎవరైన తెలియజేస్తే వాటి పై ఉక్కుపాదం మోపి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అసిస్టెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ సూపరింటెండెంట్ మైలవరం సి భార్గవ్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ సిఐ మణికంఠ రెడ్డి మరియు ఎస్సై సునీల్ కుమార్, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.