నారద వర్తమాన సమాచారం
రాజుపాలెం మండలంలో సమయపాలన పాటించని మహిళా పోలీసులు!!!
గ్రామ సచివాలయం కంటే అంగన్వాడీ సెంటర్లోనే ఎక్కువగా ఉంటున్న వైనం…
ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల లోపే పని దినం…
పల్నాడు జిల్లా రాజుపాలెం మండల పరిధిలోని మహిళా పోలీసులు సమయపాలన పాటించడం లేదంటూ ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలానికి సంబంధించి చాలామంది మహిళా పోలీసులు గుంటూరు మరియు ఇతర ప్రాంతాల నుండి అలానే దగ్గర్లో ఉన్న గ్రామాల నుండి ఉదయం 11 గంటల కు గ్రామ సచివాలయానికి రావడం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వెళ్లిపోవడం చేస్తున్నప్పటికీ జిల్లా మరియు మండల ప్రభుత్వ అధికారులు ఎవరూ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అలానే మహిళా పోలీసులు అసలు గ్రామ సచివాలయంలోనే ఉండటం లేదని అంతేకాకుండా కనిపించడం లేదంటూ కూడా గ్రామస్తులు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది మహిళా పోలీసులు ఏకంగా మూమెంట్ రిజిస్టర్ లో హాజరు వేసుకోవటం ఫలానా అంగన్వాడి సెంటర్ కు యాప్ పరిశీలన వెళ్తున్నానంటూ రాయటం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అంగన్వాడి సెంటర్ లో ఉండి అసలు గ్రామ సచివాలనికే రావటం లేదంటూ కొంతమంది గ్రామస్తులు వాపోయారు. మరి కొంతమంది మధ్యాహ్నం మూడు గంటల నుండి ఇంటికి వెళ్లి పోతున్నారని అసలు గ్రామ సచివాలయంలోనే ఉండటం లేదంటూ ప్రజలు మాట్లాడు కుంటున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తుంది. గ్రామ సచివాలయాల్లో ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండవలసిన మహిళా పోలీసులు అసలు అంగన్వాడీ సెంటర్ లో ఏం చేస్తున్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు అంగన్వాడి సెంటర్ లో ఏం పని అంటూ ప్రజలు మహిళా పోలీసులను ప్రశ్నిస్తున్నారు. రాజుపాలెం మండల పరిధిలో ఒక మహిళా పోలీసు ఎక్కువగా అంగన్వాడి సెంటర్ లోనే ఉంటుందని మరో మహిళా పోలీసు ఏకంగా మధ్యాహ్నం మూడు గంటలకే ఇంటికి వెళ్ళిపోతుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సరే అంగన్వాడి సెంటర్లో ఒకవేళ పని ఉన్నప్పటికీ కొంత సమయం అంటూ ఉంటుంది కదా ఆ సమయాన్ని కాస్త రోజు మొత్తం చేసుకొని ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో మహిళా పోలీసులపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కార్యదర్శులను మహిళా పోలీసులపై వివరణ కోరగా వారు మౌనం పాటిస్తున్నారు. అంటే కొంత రాజకీయ ఒత్తిళ్లు కూడా కార్యదర్శులపై మహిళా పోలీసులు తీసుకొస్తున్నారనేది గుసగుసలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా రాజుపాలెం మండలంలో మహిళా పోలీసులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామ సచివాలయాల్లో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని సరే ఒకవేళ అంగన్వాడీలు సంరక్షణ పరిశీలన ఒకవేళ ఉంటే ఆ సమయం కాస్త మధ్యాహ్నం తరువాత నిమిషాల్లో ఉండాలి గాని రోజుల్లో ఉండకూడదు అని అలానే ఎవరైతే ప్రజలకు అందుబాటులో లేని మహిళా పోలీసులపై జిల్లా అధికారుల చర్యలు తీసుకోవాలని అంగన్వాడి సెంటర్లో కాకుండా గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులు పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాకుండా మహిళా పోలీసులపై ఉన్నత అధికారులు దృష్టి సారించాలని ప్రజల కోరుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.